Carrot: షుగర్ ఉన్నవాళ్లు క్యారెట్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

మామూలుగా షుగర్ వ్యాధి గ్రస్తులు ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. అ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 15 Feb 2024 06 00 Pm 5393

Mixcollage 15 Feb 2024 06 00 Pm 5393

మామూలుగా షుగర్ వ్యాధి గ్రస్తులు ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. అందుకు గల కారణం షుగర్ లెవెల్స్. ఇకపోతే షుగర్ వ్యాధి దోస్తులు చాలామంది క్యారెట్ నేను తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అని సందేహ పడుతూ ఉంటారు. మరి షుగర్ ఉన్నవారు క్యారెట్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యారెట్ యాంటీ ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది.

ఆంటీ ఆక్సిడెంట్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. అందరికీ క్యారెట్లు మంచిది అని తెలుసు. డయాబెటిస్ వచ్చినవారు డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారంపై సరైన అవగాహన అవసరం. ఈ వ్యాధి వచ్చిందంటే చాలు అప్రమత్తం అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ వ్యాధి కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడతాయి. కాబట్టి ఈ సమస్యకు కారణమయ్యే ఆహార పదార్థాలను దూరం పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలలో ఇది ఒకటి.

దీనిని తినడం వల్ల దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చూడగానే ఎర్రగా నోరూరించే ఈ వెజిటేబుల్స్ పెద్దలు, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు. తియ్యగా ఉండే ఈ కూరగాయని ఊరికే తింటూ ఉంటారు అందరూ.. మరి కొంతమంది సలాడ్లో వేసుకొని జ్యూసెస్ లో స్వీట్స్ లో వేసుకొని తింటూ ఉంటారు. అయితే షుగర్ వ్యాధి వచ్చినవాళ్లు క్యారెట్ తీసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. ఇందులో నిజం ఉంది. అయితే అతిగా తినడం అంత మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యారెట్లు షుగర్ కంటెంట్, ఐ గ్లిజరిన్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని షుగర్ పేషెంట్లు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

  Last Updated: 15 Feb 2024, 06:01 PM IST