Vegetables: షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసే కూరగాయలు.. అవేంటంటే?

ప్రస్తుత రోజుల్లో ఎక్కువమంది బాధపడుతున్న సమస్యలలో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. చిన్న పెద్ద అని తేడా

  • Written By:
  • Publish Date - December 19, 2022 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో ఎక్కువమంది బాధపడుతున్న సమస్యలలో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాకుండా డయాబెటిస్ అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న కూడా కొంచెం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవడానికి ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే కేవలం మందులతో మాత్రమే కాకుండా కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా కూడా రక్తంలోని డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాగా రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి ఈ మూడు కూరగాయలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యారెట్లు ఆరోగ్యానికి అలాగే అందానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. క్యారెట్ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యారెట్ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. క్యాబేజీ కూడా డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

క్యాబేజీలో పిండి పదార్థ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. లీఫ్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. క్యాబేజీని కూరల్లో లేదంటే సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. క్యాబేజీ బంగాళదుంపలతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల రక్తంలోని నియంత్రణలో ఉంటుంది. దోసకాయలో 80% నీరు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దోసకాయను వేసవిలో తీసుకోవడం వల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉండడంతో పాటు మిమ్మల్ని కూడా ఇంత ఆరోగ్యంగా ఉంచుతుంది. దోసకాయను తినడం వల్ల అది శరీరంలో నీటి కొరతను లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు దోసకాయలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు వారి ఆహారంలో 400 నుంచి 500 గ్రాముల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. డయాబెటీస్ పేషెంట్లకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అన్నాన్ని తక్కువగా తీసుకుని రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలను తినడం మంచిది.