Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ప్రస్తుత సమాజంలో ప్రతి పది మందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 06:30 AM IST

ప్రస్తుత సమాజంలో ప్రతి పది మందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోజ్ ఉండే పరిస్థితిని డయాబెటిస్ అంటారు అన్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చనిపోయే వరకు పోదు. ఎన్ని రకాల ఆయుర్వేదం మెడికల్ మందులు ఉపయోగించినప్పటికీ డయాబెటిస్ పోదు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్న వారు ఎటువంటి ఆహారం తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు.

ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల రక్తంలోని చక్కర స్థాయి అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా అనేక రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒకవేళ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అయితే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఫుట్ అల్సర్లు వస్తాయి. ఈ ఫుట్ అల్సర్ వ్యాధి కారణంగా మీ పాదాలపై పుండ్లు ఏర్పడతాయి. అటువంటి సమయంలో వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కంటి సమస్యలు కూడా పెరుగుతాయి. డయాబెటిస్ వల్ల రెటినోపతి సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి వారి కంటి చూపును ప్రభావితం చేస్తుంది. ఇది అంధత్వానికి కూడా దారితీస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. డయాబెటీస్ బారిన పడిన వారి రక్తంలో ఎప్పుడు చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటే వారిలో రక్త నాళాలు దెబ్బతింటాయి. క్రమంగా అది గుండెపోటు, స్ట్రోక్ ను దారితీస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి చాలా వరకు కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. డయాబెటిస్ కిడ్నీస్ ను ప్రభావితం చేస్తుంది. అప్పుడు మీ శరీరం నుంచి అదనపు ద్రవాన్నని, వ్యర్థాలను క్లియర్ చేయడం మూత్రపిండాలకు కష్టంగా మారుతుంది. దీనివల్ల మూత్రపిండాల వైఫల్యం సమస్య వస్తుంది. మీకు డయాలసిస్ అవసరం కావచ్చు. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించుకోకపోతే లైంగిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధి రక్త నాళాలు, నరాలకు నష్టం కలిగిస్తుంది. అంతేకాదు లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. దీనివల్ల మీరు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపరు. దీనివల్ల మీ సెక్స్ లైఫ్ నాశనం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.