Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారు మందు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధప

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 09:34 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా ఆలోచించే విషయం ఆహార పదార్థాలు, పానీయాలు. డయాబెటిస్ కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్న పానీయాలు తాగాలి అన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏమి కాదులే అన్నట్టుగా ఏది పడితే అవి తినడం తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మందు బాబులు డయాబెటిస్ ఉన్నా సరే లెక్కచేయకుండా ఇష్టాను సారంగా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు.

మరి నిజానికి డయాబెటిస్ ఉన్న వారు మద్యం సేవించవచ్చా? మద్యం తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగానే మధుమేహం ఉన్నవారికీ నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువకాలం నుంచి షుగరుతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లెక్కడం, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు షుగరు తోడైతే వ్యాధులన్నీ తీవ్రతరం అవుతాయి.

అదేవిధంగా కాళ్లు మొద్దు బారడం, పుండ్లు పడటం, పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే ముందు భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి. మద్యం తాగిన తర్వాత భోజనం చేయకుండా మందులు వేసుకోకూడదు. కాలేయం నిరంతరం గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తూ రక్తంలో గ్లూకోజు మొతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ప్రక్రియను మద్యంలోని ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరానికి తగినంత గ్లూకోజు ఉత్పత్తి అవ్వదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి. అలాగే యాంటీ బయోటిక్స్, నొప్పిని తగ్గించే మందుల వంటివి జీర్ణాశయ పూత సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుంది. మందులు, మద్యం రెండూ కలిస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుందే కానీ తగ్గదు. కొందరికి వాంతులు, ఛాతీలో మంట వస్తాయి. మరికొందరికి రక్తపు వాంతులు కావచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మద్యం జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.