Site icon HashtagU Telugu

Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు గ్రీన్ టీ తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 31 Jan 2024 08 15 Am 6726

Mixcollage 31 Jan 2024 08 15 Am 6726

ప్రస్తుత రోజుల్లో కాఫీ టీలతో పాటు చాలామంది గ్రీన్ టీలు తాగుతున్న విషయం తెలిసిందే. కాఫీ, టీ లతో పోల్చుకుంటే ఎక్కువ శాతం మంది గ్రీన్ టీలు తాగడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ షుగర్ సమస్య కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా తెగ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో గ్రీన్ టీ కూడా ఒకటి. మరి షుగర్ పేషెంట్లు గ్రీన్ టీ ని తాగవచ్చా? ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఆరోగ్యం కోసం గ్రీన్ టీను తాగుతుంటారు. గ్రీన్ టీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గ్రీన్ టీని తాగడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్టరాల్ ను కూడా గ్రీన్ టీ తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గాలని అనుకునే వాళ్లు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. అలాగే గ్రీన్ టీని నిత్యం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాని వల్ల డయాబెటిస్ టైప్ 2 రిస్క్ ను తగ్గిస్తుంది. అందుకే షుగర్ ఉన్నవాళ్లు గ్రీన్ టీని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే గ్రీన్ టీ తాగితే ఏమైనా అవుతుందా అన్న భయం కూడా మీకు అక్కర్లేదు. షుగర్ పేషెంట్లకు ఎంతో ఉపయోగకరమైన గ్రీన్ టీని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే..

కాసిన్ని నీటిని మరిగించి.. గ్రీన్ టీ ఆకులను వేయాలి. ఇంకాసేపు మరిగాక దాన్ని వడబోసి కప్ లో పోసి, తేనె కానీ నిమ్మరసం కానీ కలుపుకొని తాగేయడమే. అయితే గ్రీన్ టీని నిత్యం తీసుకోవచ్చు కానీ, ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. పరిమితంగా అంటే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగితే చాలు. షుగర్ ను కంట్రోల్ చేసుకోవడంతో పాటు పలు రకాల సమస్యలను కూడా జయించవచ్చు. అలా అని ఎక్కువగా తాగితే మాత్రం ప్రమాదం తప్పదు.