Site icon HashtagU Telugu

Mushrooms: మధుమేహం ఉన్నవారు పుట్టగొడుగులు తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Mixcollage 13 Jun 2024 04 30 Pm 4244

Mixcollage 13 Jun 2024 04 30 Pm 4244

ప్రస్తుత రోజులో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఆహార పదార్థాల విషయం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటినే మష్రూమ్స్ అని కూడా అంటారు. చాలామంది వీటిని తినడానికి ఆలోచిస్తూ ఉంటారు.

మరి మధుమేహం ఉన్నవారు పుట్టగొడుగులు తినవచ్చో,తినకూడదో తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మష్రూమ్స్ డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మష్రూం అనేది ఒక రకమైన సూపర్ ఫుడ్. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ తక్కువ. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అంటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. కేలరీలను కూడా నియంత్రిస్తుంది. మష్రూంలో పంచదార, కార్బోహైడ్రేట్లు సమానంగా ఉండటం వల్ల కేలరీలు నియంత్రణలో ఉంటాయి.

అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు మష్రూం తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే మష్రూంలో పాలీ శాకరైడ్స్ కారణంగా యాంటీ డయాబెటిక్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. మధుమేహానికి వ్యతిరేకంగా రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది మధుమేహం రోగులకు చాలా ఉపయోగకరం. బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మష్రూం ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు డయాబెటిస్‌ను పెంచుతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. మష్రూంలు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. మష్రూంలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, మినరల్స్ ఉంటాయి. వీటికితోడు విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, టర్పెన్, క్వినోలోన్, స్టెరాయిడ్, ఫ్లెవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ పేషంట్లు మష్రూమ్స్ ని ఎటువంటి భయం లేకుండా తినవచ్చు.