Site icon HashtagU Telugu

Diabetes Patients : షుగర్ వ్యాధిగ్రస్తులు సీతాఫలం తినవచ్చు.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Diabetes Patients Can Eat Custard Apple.. Do You Know What Happens If You Eat It..

Diabetes Patients Can Eat Custard Apple.. Do You Know What Happens If You Eat It..

Custard Apples for Diabetes Patients : ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు పండ్లు తినాలి అన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది డయాబెటిస్ కారణంగా కాస్త తీపి ఉన్న ఆహార పదార్థాలు లేదంటే పండ్లను తీసుకోవాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో సీతాఫలం (Custard Apples) కూడా ఒకటి. షుగర్ వ్యాధిగ్రస్తులకు (Diabetes Patients) సీతాఫలం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

సీతాఫలంలో (Custard Apples) పీచు పదార్థం, క్యాల్షియం, పొటాషియం, చక్కెర, పిండి పదార్థాలు, విటమిన్ష పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జలుబు చేసిన కూడా హాయిగా తీసుకోవచ్చు. ఈ సీతాఫలం ని రెండు రకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఒకటి రామఫలం రెండవది లక్ష్మణ ఫలం. రామఫలం షుగర్ వ్యాధిగ్రస్తులకు (Diabetes Patients) చాలా ప్రయోజనకరమైన పండు. సహజంగా షుగర్ పేషెంట్లకు ఈ పండ్లను తీసుకోమని వైద్యనిపుణులు చెబుతుంటారు. అలాగే రామపలం తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. ఎర్రగా నున్నగా మందని పై పొరతో ఉండే ఈ పండు రామఫలం. ఈ పండులో సీతాఫలంలో ఉండే అన్ని పోషక విలువలు దీనిలో ఉంటాయి.

రామ పలంలోని 75 కేలరీల శక్తి కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పీచు పదార్థం, ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ లోని దీనిలో పుష్కలంగా ఉంటాయి. రామఫలం లోపల గుజ్జు చాలా మెత్తగా ఉంటుంది. అదేవిధంగా ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండు తీసుకోవడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్ తగ్గుతుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి ఈ రామఫలం చాలా బాగా సహాయపడుతుంది. అలాగే షుగర్ నియంత్రించే లక్షణాలు ఈ ఫలంలో ఉంటాయి. చాలామంది ఈ పండ్లు తీయగా ఉంటాయి అని తినడానికి భయపడుతూ ఉంటారు. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండుని ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఈ ఫలం శరీరంలో షుగర్ లెవెల్స్ ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ పండును వైల్డ్ స్వీట్ అని కూడా పిలుస్తుంటారు. మీరు శరీర బరువును తగ్గాలనుకుంటే ఈ పండు మీకు చాలా సహాయంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది.

అలాగే ఊబకాయం కూడా తగ్గిపోతుంది. ఈ పండు తీసుకోవడం వల్ల బరువు చాలా తొందరగా తగ్గుతారు. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రామఫలం తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోదక శక్తి మెరుగుపడుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మీ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో రామఫలం మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం, తల దురద లాంటి సమస్యలు కూడా ఈ పండు తీసుకోవడం వలన తగ్గిపోతాయి. దీనిలో విటమిన్ సి కారణంగా జుట్టు చర్మాన్ని చాలా సంరక్షిస్తుంటాయి.

Also Read:  Health Problems: ఆ సమస్యలు ఉన్నవారు పచ్చిబఠానీ తింటే అంతే సంగతులు?