Salt: ఉప్పు అధికంగా తింటున్నారా.. అయితే జాగ్రత్త మధుమేహం రావచ్చు!

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పులేని వంట గది దాదాపుగా ఉండదు ఎటువంటి సందేహం లేదు. ఎన్నో రకాల వంటకాలల

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 11:27 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పులేని వంట గది దాదాపుగా ఉండదు ఎటువంటి సందేహం లేదు. ఎన్నో రకాల వంటకాలలో ఈ ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఉప్పు ఎక్కువగా తినడం అలవాటు. మరికొందరికి ఉప్పు తక్కువగా తినడం అలవాటు. ఉప్పు తక్కువ తినడం మంచిదే కానీ ఎక్కువ తింటే మాత్రం ఎన్నో రకాల సమస్యలను ఏరుకోరి మరి తెచ్చుకున్నట్టే. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు.

మరి ఉప్పు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షుగర్ రాకుండా ఉండాలి అంటే ఉప్పును ఎక్కువగా ఉపయోగించడం మానుకోవాలి. ఉప్పు వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. అసలు ఉప్పు వేసుకోనివారు, అప్పుడప్పుడు ఉప్పు వేసుకునేవారు, ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వాడేవారిని పరిశీలించగా తినే ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నట్లు ఒక పరిశోధనలో తేలింది. ఉప్పును తక్కువగా వాడుతుంటే గుండెజబ్బు, అధిక రక్తపోటు ముప్పుండదు.

ఉప్పు తక్కువగా వాడటంవల్ల టైప్2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తోంది. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి మరీ తెలిపారు. అలాగే అరుదుగా ఉప్పు తినేవారికి షుగరు ముప్పు కేవలం 13 శాతమే ఉంటోంది. కొన్నిసార్లు వేసుకునేవారికి 20 శాతం, ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారికి 39 శాతం షుగరు వచ్చే ముప్పు కనపడుతోంది. ఉప్పుతో షుగరు వచ్చే ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియరావడం లేదు. ఎక్కువెక్కువ తినడం కూడా ఒక కారణం కావచ్చు.