Site icon HashtagU Telugu

Diabetes Causes: ఈ అలవాట్లను వదులుకోండి…లేదంటే మీరూ మధుమేహ బాధితులుగా మారవచ్చు..!!

Milk For Diabetes

Milk For Diabetes

మధుమేహం ప్రపంచంలో సగం మంది ఎదుర్కొంటున్న సమస్య. వయస్సుతో పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జన్యు పరంగా ఉన్నప్పటికీ…మన జీవన శైలి కూడా మధుమేహానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ లో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అజాగ్రత్తగా ఉంటే ప్రాణానికే ప్రమాదం. మధుమేహం టైప్ 1, టైప్ 2 రెండు రకాలు. ఇక్కడ టైప్ 1 డయాబెటిస్ జన్యుపరమైనది. జీవనశైలి, ఆహారంలో మార్పుల ద్వారా టైప్ 2 మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. కాబట్టి ముందుగా ఏ అలవాట్లు మిమ్మల్ని టైప్-2 డయాబెటిస్ బాధితురాలిగా మార్చగలవో తెలుసుకోవడం ముఖ్యం.

1 . నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు అధిక బరువుతో ఉంటే, మీకు టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

2 . వయసు పెరిగే కొద్దీ మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా 45 ఏళ్ల తర్వాత ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

3 . ఎలాంటి శారీరక శ్రమ చేయని వారికి కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. సక్రమంగా లేని జీవనశైలి బరువు పెరగడానికి దారితీస్తుంది. దీని వల్ల షుగర్ మాత్రమే కాదు. అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటి వ్యాధులు కూడా వస్తాయి.

4 . ఇది కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా షుగర్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ధ్యానం క్రమం తప్పకుండా చేయండి.

మధుమేహం లక్షణాలు
– తరచుగా మూత్ర విసర్జన
– చిరాకు
– అలసట భావన
– గాయాలు త్వరగా మానకపోవడం
– నోరు పొడిబారిపోవడం.

జాగ్రత్తలు తప్పనిసరి.:
డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. అలా అని తక్కువగా కూడా ఉండకూడదు. అటువంటి పరిస్థితిలో రక్తంలో షుగర్ ను ఎప్పికప్పుడు చెక్ చేసుకోవాలి. మధుమేహం అధిక స్థాయి లేదా చాలా తక్కువ స్థాయి ఉన్నట్లయితే రోగికి ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు.