Site icon HashtagU Telugu

Diabetes: ఈ ఆకులు 7 రోజులు తీసుకుంటే చాలు.. డయాబెటిస్ కంట్రోల్ అవ్వాల్సిందే?

Mixcollage 19 Dec 2023 03 19 Pm 8947

Mixcollage 19 Dec 2023 03 19 Pm 8947

ప్రస్తుత జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు ఇక పోదు. అయితే ఈ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటుగా చాలామంది అనేక రకాల వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ సమస్య ఉన్నవారికి షుగర్ ఎక్కువ తక్కువ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

దీంతో చాలామంది తెగ భయపడుతూ ఉంటారు. అయితే ఇక మీదట భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలను వరుసగా ఏడు రోజులు పాటిస్తే చాలు షుగర్ కంట్రోల్ లో ఉండాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేపాకులు.. ఈ వేపాకులను తెలంగాణలో పల్లెల ప్రాంతాలలో యాంటీబయాటిక్ గా వాడుతూ ఉంటారు. వీటిని అధికంగా చర్మ ఇతర అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకులను పొడిచేసి ఆ పొడిని నిత్యం నీటిలో కలుపుకొని తాగినట్లయితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటిస్ శాశ్వతంగా తగ్గిపోతుంది.

మామిడి ఆకులు.. ఈ మామిడాకులు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకుల్ని టీ లా తయారు చేసుకొని నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే శరీరానికి ఫైబర్ విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. అలాగే బ్లడ్ లో చక్కెర లెవెల్స్ ను కంట్రోల్స్ లో ఉంటుంది. మెంతి ఆకులు.. ఈ మెంతి ఆకులను చాలామంది తినేందుకు ఇష్టపడుతుంటారు. దీనిలో ఉండే గుణాలు సులభంగా నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్నీ కాపాడతాయి. కావున డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ ఆకులని నిత్యం తప్పకుండా వాడవలసి ఉంటుంది. మెంతి ఆకుల మాత్రమే కాకుండా మెంతులు కూడా షుగర్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకోసం రాత్రి సమయంలో మెంతులు కొన్ని నానేసి మరిసటి రోజు ఉదయం ఆ మెంతులు తిని ఆ నీటిని తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. కరివేపాకు బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ ఉంచేందుకు కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఆహారంలో తప్పకుండా కరివేపాకును వాడవలసి ఉంటుంది.