Site icon HashtagU Telugu

Diabetes: మధుమేహం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తీసుకోవాల్సిందే!

Diabetes

Diabetes

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య డయాబెటిస్. ప్రతీ పదిమందిలో ఆరుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. అయితే షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో మెడిసిన్స్ యూస్ చేయడంతో పాటు రకరకాల హోమ్ మేడ్ చిట్కాలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అయితే మెడిసెన్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఆ అవసరం లేదు అంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల పండ్లు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ లో ఉంటాయని చెబుతున్నారు. అందుకోసం ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా నేరేడు పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయట. నేరేడు పండులో ఉండే కొన్ని పోషకాలు మధుమేహ సమస్యను నివారించడంలో దోహదపడతాయని చెబుతున్నారు. నేరేడు పండ్లు తినడమే కాకుండా ఈ పండ్ల విత్తనాలతో తయారు చేసిన పొడిని టీలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందట. అంతేకాకుండా దీర్ఘకాలి వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని చెబుతున్నారు.

అలాగే షుగర్ ని అదుపులో ఉంచడానికి జామ పండు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బాగా పండిన జామ పండు కాకుండా కొంచెం దోరగా పచ్చిగా ఉండి జామపండు తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందట. అలాగే జామపండు ఆకులను బాగా శుభ్రం చేసి ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని తాగటం వల్ల కూడా మధుమేహం నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అలాగే మధుమేహ నివారణలో అంజీర్‌ ఆకులు కూడా ఎంతో ప్రభావవంతంగా సహాయపడతాయట. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్‌ ఆకులను నమిలి తింటే మధుమేహ సమస్య నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని మెంతి గింజలను తీసుకోవటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుందట. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా నియంత్రిస్తుందని చెబుతున్నారు.