Site icon HashtagU Telugu

Breast Milk Jewellery: బ్రెస్ట్ మిల్క్ తో జ్యువెలరీ డిజైనింగ్.. సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్

Whatsapp Image 2023 01 22 At 19.57.18

Whatsapp Image 2023 01 22 At 19.57.18

Breast Milk Jewellery: ఆభరణాల డిజైనింగ్ వ్యాపారానికి క్రేజ్ పెరిగింది. స్త్రీలే కాదు పురుషులు కూడా వివిధ రకాల ఆభరణాలను ధరించడం వల్ల ఈ డిమాండ్ రెక్కలు తొడిగింది. బంగారం-వెండి, వజ్రం- ముత్యాలతో చేసిన నగలను మీరు చూసి ఉంటారు. కానీ కెనడాలోని టొరంటోకు చెందిన 33 ఏళ్ల జ్యువెలరీ డిజైనర్ అమండా బూత్ వెరైటీ కాన్సెప్ట్ లతో ఆభరణాలను తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే.. బ్రెస్ట్ మిల్క్ తో కొన్ని ప్రత్యేక ఆభరణాలను ఆమె తయారు చేసి అమ్ముతోంది. ఈ కాన్సెప్ట్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఘాటుగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె డిజైన్‌లను ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ ఆలోచన అమండాకు ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ ఆమె ఐడియా కాదు. ఎందుకంటే.. కొందరు రెగ్యులర్ కస్టమర్స్ అమండాకు ఈ ఐడియా ఇచ్చారట.ఒక మహిళ తన బ్రెస్ట్ మిల్క్ తో ఒక నగను డిజైన్ చేయమని చెప్పిందట. అందువల్ల ఆ కాన్సెప్ట్ వైపు అమండా దృష్టి పెట్టిందట. మరణించిన తన కొడుకు బూడిద తో ఒక నగను తయారు చేయాలని మరో కస్టమర్ అమండా కు రిక్వెస్ట్ చేసిందట. ఇలాంటి ఆర్డర్లు అమండా మైండ్ సెట్ ను మార్చాయని కెనడా మీడియా కథనాల్లో ప్రస్తావించారు. ఈమేరకు వివరాలతో అమండా ఒక వీడియోను సోషల్ మీడియా సైట్ టిక్‌టాక్‌లో ఇటీవల పోస్ట్ చేసింది. ఆ తర్వాత అది వేగంగా వైరల్ అయింది. దీంతో ప్రపంచ దేశాల మీడియాలోనూ అమండాపై స్టోరీస్ పబ్లిష్ అయ్యాయి.అయితే ఇటువంటి చాలా ఆర్డర్లు మరెంతో మంది నుంచి ఆమెకు వచ్చాయట.
గత నెల రోజుల్లోనే ఇటువంటి వందలాది ఆర్డర్లు అమండాకి లభించాయి.

ఇంకా దారుణమైన ఆర్డర్స్..

జుట్టు, బొడ్డు తాడుతో కూడా ఆభరణాలను తయారు చేయడాన్ని ఆమె ప్రారంభించారు. ఇటీవల ఒకరు అమండాకి ఫోన్ చేసి.. తన వీర్యంతో ఆభరణాలు చేయమని అడిగాడట.