Site icon HashtagU Telugu

Ghee: నెయ్యితో జుట్టు సమస్యలు పరిష్కారం అవుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Ghee

Ghee

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తొలగించడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందుకే తరచుగా నెయ్యిని తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే నెయ్యితో జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. జుట్టు సమస్యలకు నెయ్యి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో చాలా రకాల కారణాలు వల్ల చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జుట్టు రాలడం జుట్టు తెల్లగా మారడం చుండ్రు, పొట్టి జుట్టు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి నెయ్యిని ఉపయోగించవచ్చట చాలా జుట్టు సమస్యలకు దేశీ నెయ్యి పరిష్కారం అని చెబుతున్నారు. మరి దేశీ నెయ్యితో జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేడి నెయ్యితో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. నెయ్యి జుట్టుకు పోషకాలను అందించే ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. కాబట్టి జుట్టు సహజంగా పెరగడానికి నెయ్యి సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్ ,ఫ్యాటీ యాసిడ్ గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఈ రెండు కారకాలు జుట్టు , స్కాల్ప్‌ కు చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. కాగా నెయ్యిలో విటమిన్ ఎ , ఇ, ప్రొటీన్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. నెయ్యిలోని విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని నివారించి శిరోజాలను బలపరుస్తుంది. నెయ్యి మసాజ్ వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. జుట్టులో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది చుండ్రును కూడా తొలగిస్తుంది. నెయ్యిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అయితే నెయ్యిని తరచుగా అప్లై చేయడం వల్ల జుట్టు మెరుపును పెంచుతుంది. వాటిని మృదువుగా కూడా చేస్తుందట. అయితే ఇందుకోసం కాస్త నెయ్యిని తీసుకొని కొద్దిగా వేడి చేయాలి. ఆ తర్వాత నెయ్యిని మీ జుట్టుకు బాగా అప్లై చేయాలి. మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. నెయ్యిని జుట్టు మీద కనీసం ఒక గంట లేదా రాత్రిపూట అలాగే ఉంచాలి. దీంతో జుట్టుకు పుష్కలంగా పోషణ లభిస్తుంది. మీ జుట్టును సాధారణ షాంపూతో కడగాలి, మీరు నెయ్యిని అప్లై చేస్తే రెండుసార్లు షాంపూ చేయడం మంచిది. ఇలా కనీసం వారానికి ఒకసారి దేశీ నెయ్యిని ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.

note: పైన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. అందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.