Dengue: గర్భిణీ స్త్రీలకు డెంగ్యూ వస్తే ఏం చేయాలో.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

వర్షాకాలం మొదలయ్యింది అంటే చాలు ఒకదాని తర్వాత ఒకటి రోగాలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా టై

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 09:40 PM IST

వర్షాకాలం మొదలయ్యింది అంటే చాలు ఒకదాని తర్వాత ఒకటి రోగాలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటివిఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రతి ఏటా డెంగ్యూ, మలేరియా బారిన పడి కొన్ని వందల మంది మరణిస్తున్నారు. చాలామంది వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధుల బారినపడుతున్నారు. అయితే ఒకవేళ గర్భిణీ స్త్రీలకు డెంగ్యూ వ్యాధి వస్తే ఏం జరుగుతుంది? అటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గర్భిణీ స్త్రీలకు డెంగ్యూ వ్యాధి కనుక సోకితే గర్భంలో పెరుగుతున్న పిండానికి మద్దతుగా రోగ నిరోధక వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది. దీనివల్ల గర్భిణీలు డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లకు త్వరగా లోనవుతారు. గర్భధారణ సమయంలో హార్మోన్లు కూడా మార్పులు అధికంగా చెందుతాయి. దీనివల్ల వ్యాధులు సులభంగా సోకుతాయి. గర్భధారణ సమయంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ తల్లీ బిడ్డ ఇద్దరికీ సోకే అవకాశం ఉంది. దీనివల్ల బిడ్డ చాలా ప్రభావితం అవుతుంది. తక్కువ బరువుతో పుట్టడం లేదా నెలలు నిండకుండా జన్మించడం, గర్భంలోనే మరణించడం వంటివి జరుగుతాయి.

కాబట్టి గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ముందుగానే డెంగ్యూ రాకుండా జాగ్రత్తపడాలి. ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి. శరీరమంతా కప్పేలా దుస్తులు వేసుకోవాలి. దోమతెరలను ఉపయోగిస్తూ ఉండాలి. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కిటికీలు ఎప్పుడు వేసే ఉంచుకోవాలి. జ్వరం వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను అధికంగా తినాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు కచ్చితంగా తినాలి. వైద్యులు ఇచ్చిన మందులు కచ్చితంగా వేసుకోవాలి. డెంగ్యూ సోకాక మాత్రం కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తినాలి. కొబ్బరినీళ్లు తాగుతూనే ఉండాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో ఖనిజాలు లోపించకుండా ఉంటుంది. ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత రాకుండా కొబ్బరినీళ్లు అడ్డుకుంటాయి. అలాగే కప్పు పెరుగు కచ్చితంగా తినాలి. ముఖ్యంగా చేయవలసింది వర్షాకాలంలో జ్వరాలు వస్తున్నాయి అంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించి అందుకు సంబంధించి తీసుకోవడం మంచిది.