Dengue Cases : డెంగ్యూ కేసులతో కిక్కిరిసిపోతున్న హాస్పటల్స్

హైదరాబాద్‌ మహానగరాన్ని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో డెంగ్యూ దోమలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెంది జనాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి

Published By: HashtagU Telugu Desk
Dengue Cases In Hyderabad

Dengue Cases In Hyderabad

దేశ వ్యాప్తంగా రోజు రోజుకు డెంగ్యూ (Dengue ) కేసులు ఎక్కువై పోతున్నాయి. పల్లెల దగ్గరి నుండి నగరం వరకు ఎవర్ని చూడు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ (Hyderabad) మహానగరాన్ని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో డెంగ్యూ దోమలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెంది జనాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. చిన్న హాస్పటల్ దగ్గరి నుండి పెద్ద హాస్పటల్ వరకు అన్ని కూడా డెంగ్యూ కేసులతో కిటకిటలాడిపోతున్నాయి.

ఇక ప్రభుత్వ హాస్పటల్స్ లలో అయితే ఇసుకేస్తే రాలనంత రోగులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలోని డెంగ్యూ కేసుల్లో 40శాతం హైదరాబాద్‌లో నమోదువ్వుతున్నాయంటే అర్ధం చేసుకోవాలి హైదరాబాద్ లో దోమల పరిస్థితి ఎలా ఉందొ.. చాలా మందికి రూమ్స్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. విష జ్వరాలు, వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో పరిశ్రుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

డెంగ్యూ (Dengue ) లక్షణాలు :

101 నుంచి 105 డిగ్రీల ఫారన్‌హీట్ జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, కళ్లు మండటం వంటి లక్షణాలు వస్తాయి. తీవ్రమైన ఒళ్లునొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదరభాగం పై వైపున నొప్పి వస్తుంది.

ఉష్ణోగ్రత పెరిగినపుడు తీవ్రంగా నీరసం, తలతిరగడం, ముక్కు నుంచి రక్తస్రావం, మలవిసర్జన నల్లగా ఉంటుంది. దోమ కుడితే ఏర్పడే ఎర్రని చుక్కల వంటివి ఏర్పడతాయి. డెంగ్యూతో పాటుగా రక్తస్రావం (డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్) లేదా రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌లు కనిపిస్తే ప్రాణాంతకమే. ఇలాంటివారు 5 శాతానికి అటు ఇటుగా ఉంటారు. 95 శాతం మందికి ప్రాణాంతకం కాదు.

తీసుకోవాల్సి జాగ్రత్తలు :

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య ఎక్కువవుతుంది. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, హైడ్రేట్‌గా ఉండాలి. సూప్స్, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్స్ సూచించిన ట్యాబ్లెట్స్ మాత్రమే వేసుకోవాలి. సొంత వైద్యం అస్సలు పనికిరాదు. తుమ్మడం, దగ్గడం చేసినప్పు నోరు, ముక్కు కవర్ అయ్యేలా చూసుకోవాలి. మంచి పోషకాహారం మూడు పూటలా తీసుకోవాలి. జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలని మర్చిపోకూడదు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. దోమతెరలు, దోమలను పారదోలే రసాయనాలను వాడాలి. నిలవనీరు లేకుండా చూసుకోవాలి.

Read Also : Afghanistan Team: భారత్ చేరుకున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు

  Last Updated: 26 Sep 2023, 10:47 AM IST