Sex Reassignment: ఢిల్లీలో ఉచిత లింగ‌మార్పిడి ఆప‌రేష‌న్లు

లింగ‌మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ల‌ను ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఉచితంగా అందించే సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకుంది. ఆ మేర‌కు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోని బ‌ర్న్ అండ్ ప్లాస్టిక్ వార్డ్ ల‌ను సిద్ధం చేయాల‌ని కేజ్రీవాల్ స‌ర్కార్ ఆదేశించింది.

  • Written By:
  • Updated On - November 28, 2022 / 11:30 AM IST

లింగ‌మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ల‌ను ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఉచితంగా అందించే సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకుంది. ఆ మేర‌కు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోని బ‌ర్న్ అండ్ ప్లాస్టిక్ వార్డ్ ల‌ను సిద్ధం చేయాల‌ని కేజ్రీవాల్ స‌ర్కార్ ఆదేశించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ జోక్యంతో ఆ మేర‌కు స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ ప్లాస్టిక్ సర్జన్ ద్వారా ఉచితంగా సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీలు అందించాలని సర్క్యులర్ పంపిందని DCW తెలిపింది.

ఆరోగ్య శాఖతో చాలా నెలలుగా ఈ విషయాన్ని కొనసాగిస్తున్నందున కమిషన్ చ‌ర్చించింది. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీలు (ఎస్‌ఆర్‌ఎస్) లేకపోవ‌డం ప్ర‌ధానంగా ఉంద‌ని క‌మిష‌న్ భావించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఆప‌రేష‌న్ కు 10-15 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుందని గుర్తించింది. ఆ త‌రువాత ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత లింగమార్పిడి శస్త్రచికిత్స సదుపాయం కల్పించడానికి సంబంధించిన సమాచారాన్ని కోరుత ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖకు క‌మిష‌న్ నోటీసు జారీ చేసింది.

ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో SRS సౌకర్యం అందుబాటులో లేదని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్‌కు నివేదించింది. అయితే, కమిషన్ పట్టుబట్టడంతో, ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిపై నివేదికను సమర్పించాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో తొలుత ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ హాస్పిటల్‌లోని బర్న్ & ప్లాస్టిక్ విభాగంలో ఉచిత సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ (SRS) సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని కమిషన్‌కు తెలియజేయబడింది.

ప‌లు విధాలుగా క‌మిష‌న్ ఒత్తిడి తీసుకురావ‌డంతో ప్లాస్టిక్ సర్జన్ సదుపాయంతో పాటు ఒక బర్న్ మరియు ప్లాస్టిక్ వార్డ్’ తప్పనిసరిగా ట్రాన్స్‌జెండర్లకు ఉచిత లింగమార్పిడి శస్త్రచికిత్సలను అందించడం ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉచితంగా ఉన్నప్పుడు, ట్రాన్స్‌జెండర్లు తమ జీవితాలకు కీలకమైన ప్రక్రియ కోసం రూ. 10 నుంచి 20ల‌క్ష‌లు ఎందుకు చెల్లించాల‌ని DCW చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు. మొత్తం మీద మ‌లివాల్ చేసిన పోరాటానికి ఉచిత లింగ‌మార్ప‌డి ఆప‌రేష‌న్ కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది.