Dates: నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం తీసుకోవడం జరిగే మార్పులు ఇవే?

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఖర్జూరం గురించి మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లలకి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఖర్జూరాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Mixcollage 06 Feb 2024 05 39 Pm 5194

Mixcollage 06 Feb 2024 05 39 Pm 5194

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఖర్జూరం గురించి మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లలకి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఖర్జూరాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని ప్రతిరోజు తినమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అవి శరీరాన్ని రక్షిస్తాయి. తరచూ ఖాళీ కడుపుతో ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు హార్మోన్ల సమతుల్యతలో కూడా సహాయపడతాయి.

ముఖ్యంగా ఖర్జూరంను ఉదయం పరిగడుపున తీసుకున్నట్లయితే మరిన్ని లాభాలను పొందవచ్చు. మరి ఉదయాన్నే ప్రతిరోజు పరగడుపున ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఖర్జూరం నెయ్యి కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఖర్జూరాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల కదలికను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే నెయ్యిలో బ్యుట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది.

ఇది గట్ బ్యాక్టీరియా సమతుల్యతను రక్షిస్తాయి. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వలన జీర్ణ క్రియ మెరుగవుతుంది. మలబద్ధకం నుండి బయటపడవచ్చు. నెయ్యిలో నానబెట్టిన ఖర్జునాన్ని తినడం వలన ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని ఈ విధంగా తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. ఖర్జూరం నెయ్యి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఖర్జూరంలో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని నుంచి కాపాడతాయి. నీళ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.

  Last Updated: 06 Feb 2024, 05:39 PM IST