Eye Glasses: కళ్లు మసకలకు చాలామంది కళ్లజోడు వాడుతూ ఉంటారు. కంటిచూపు మందగించడం వల్ల కంటిచూపు మెరుగ్గా కనిపించడానికి కళ్లజోడు ఉపయోగిస్తారు. కళ్లజోడు వాడటం వల్ల కంటిచూపు మెరుగ్గా కనిపించడంతో పాటు అనేక లాభాలు ఉన్నాయి. కంట్లో దుమ్ము, ధూళి, నరుసులు పడకుండా ఉపయోగపడుతుంది. అలాగే ప్రమాదకర వైరస్ లు, బ్యాక్టీరీయాలు కంట్లోకి వెళ్లకుండా కళ్లజోడు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
అలాగే చాలామంది తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటికి కళ్లజోడు ఉపయోగిస్తూ ఉంటారు. కళ్లజోడు పెట్టుకోవడం వల్లన తలనొప్పి ఉండదరు. కానీ కళ్లజోడు వాడటం వల్ల కళ్ల కింద నల్లటి మచ్చలు అచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల మొఖంపై నల్లమచ్చలు వికారంగా కనిపిస్తున్నాయి. దీని వల్ల మొఖం అందంగా కనిపించదు. దీంతో నచ్చటి మచ్చలను పొగోట్టుకోవడానికి చాలామంది చలారకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో నల్లటి మచ్చలను పొగోట్టుకోవచ్చు. అదేలానో చూద్దాం.
ఆలుగడ్డను గుజ్జుగా చేసి ఒక దూదితో లేదా మెత్తని క్లాత్ తో డార్క్ మచ్చలు ఉన్నచోట్ల పెట్టుకోవాలి. అనంతరం 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. అలాగే అలాగే రాత్రి పడుకునే ముందు బాదం నూనెను నల్లటి మచ్చలు ఉన్న ప్రాంతాల్లో రాసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీటతో కడుక్కొవాలి. దీంతో పాటు ఫ్రిడ్జ్ లో ఉన్న దోసకాయ ముక్కలను 10 నిమిషాల పాటు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశం మీద పెట్టాలి. దీని వల్ల నల్ల మచ్చలు తొలగిపోయే అవకాశముంటుంది.
ఇవే కాకుండా రోజ్ వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు 15 నిమిషాల పాటు కళ్ల కింద రోజ్ వాటర్ పెట్టుకుందే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక నిమ్మరసం ,. టమాటా జ్యూస్ మిక్స్ చేసి నల్లటి మచ్చలు ఉన్నచోట రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.