Site icon HashtagU Telugu

Dark Circles: డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Mixcollage 15 Jun 2024 01 24 Pm 8597

Mixcollage 15 Jun 2024 01 24 Pm 8597

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖం అందంగా ఉన్నప్పటికీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అనేక రకాల చిట్కాలను, బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు రాలేదని దిగులు చెందుతూ ఉంటారు.

మరి ఈ సమస్యను ఎలా పోగొట్టుకోవాలో అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం కీర దోసకాయను గుండ్రంగా కట్ చేసి ఆ ముక్కలను కళ్ళపై 20 నిమిషాల పాటు పెట్టుకొని ఆ తర్వాత మంచినీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య దూరం అవుతుంది. అలాగే టమోటా ముక్కలు లేదా గుజ్జును కళ్ల కింద డాగ్ సర్కిల్స్ పై అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉండి ఆ తర్వాత కడిగేసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడుసార్లు ఈ విధంగా చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం అవ్వడం ఖాయం.

అలాగే వాడినా లేదంటే కొత్త గ్రీన్ టీ బ్యాగులను తేమతో నానబెట్టి ఐదు నిమిషాల పాటు కళ్ళపై ఉంచుకోవాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే పడుకునే ముందు బాదం లేదా కొబ్బరి నూనెను డాట్ సర్కిల్స్ పై అప్లై చేసి మసాజ్ చేసి పడుకొని ఉదయం లేవగానే మంచినీటితో శుభ్రం చేసుకుంటే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. అయితే పైన చిట్కాలను పాటించడంతో పాటు ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే తగినంత నిద్రపోతే ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతాయి.