Site icon HashtagU Telugu

Dandruff: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఈ పని చేయాల్సిందే!

Mixcollage 09 Jul 2024 07 45 Am 1821

Mixcollage 09 Jul 2024 07 45 Am 1821

ప్రస్తుత రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ చుండ్రు సమస్యను పోగొట్టుకోవడానికి రకరకాల షాంపూలు, వంటింటి చిట్కాలు ఎన్నెన్నో పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఈ చుండ్రు సమస్య అలాగే వేధిస్తూ ఉంటుంది. కానీ కొన్ని రకాల చిట్కాలు తప్పకుండా పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు. మరి చుండ్రు సమస్య తగ్గాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు సమస్యలకు మెంతికూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు మెంతి ఆకులను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. జుట్టు మొత్తం ఈ మిశ్రమాన్ని రాసిన తర్వాత ఒక అరగంట పాటు బాగా ఆరే వరకు అలాగే ఉండి, తర్వాత తక్కువ రసాయనాలు ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే ఏం జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు సమస్య ఈజీగా తగ్గుతుంది. అయితే ఇందుకోసం కేవలం పుల్లని పెరుగు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. . అయితే అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు జుట్టుకు ఉంచి శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మార్కెట్ లో దొరికే రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను ఉపయోగిస్తే అది తలపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

అందుకే తేలికపాటి, హెర్బల్ షాంపూని ఉపయోగించడం మంచిది. శీతాకాలంలో చాలా మంది వేడినీటితో స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల తలలోని తేమ మొత్తం ఆరిపోతుంది. దీంతో చుండ్రు సమస్యను పెరుగుతుంది. అలాగే తలపై స్కార్ఫ్‌లు, క్యాప్‌లు ధరించడం వల్ల తగినంత గాలి అందక చుండ్రు సమస్య పెరుగుతుంది. జుట్టులో చుండ్రు సమస్యకు థైరాయిడ్‌ కూడా కారణమట. దీనివల్ల స్కాల్ప్ డ్రైగా మారి జుట్టు విరగడం, రాలడం మొదలవుతుంది. కాగా జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి పెరుగుతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి జుట్టుకు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అయితే నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలను తొలగిస్తుందని తెలిపారు వైద్యులు.

note: Note : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి.