Site icon HashtagU Telugu

Curry Leaves Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకుని తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 04 Dec 2023 02 47 Pm 4381

Mixcollage 04 Dec 2023 02 47 Pm 4381

ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలలో కరివేపాకు మొక్క కూడా ఒకటి. కరివేపాకు వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దాదాపుగా ఇండియన్ వంటకాలలో అన్ని రకాల కూరల్లో కరివేపాకును తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు.. ఇది కూర యొక్క రుచిని మరింత పెంచుతుంది. కరివేపాకు ఆకుల్లో విటమిన్లు కాపర్, ఐరన్ ,క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మరి కరివేపాకు ఆకులను ఉదయాన్నే తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు ఆకులను నమలడం వలన బరువు పొట్ట కొవ్వు తగ్గుతాయి. ఇందులో ఇతైల్, అసిటేట్ లో రోమిధన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. కంటి ప్రమాదాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కరివేపాకులో యాంటీ ఫంగల్ యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి హైపోగ్ గ్లైసిమిక్ లక్షణాలు కారణంగా కరివేపాకులను డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు నిత్యం తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. నిత్యం ఖాళీ కడుపుతో కరివేపాకుని తీసుకోవడం వలన మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే యాసిడిటీ ,మలబద్దకం ఉబ్బరం మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇది జుట్టు ఎదుగుదలకు జుట్టు సమస్యల నుంచి రక్షించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది కూరలో వేసిన కరివేపాకుని తినేటప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. కరివేపాకును తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.