Diabetes: రోజుకు పది ఆకులు తింటే.. మూడు నెలల్లో షుగర్ వ్యాధి కంట్రోల్.. పూర్తి వివరాలు!

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. దీనినే షుగర్ వ్యాధి లేదా

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 03:33 PM IST

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. దీనినే షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. దానివల్ల అనేక రకాల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ డయాబెటిస్ అనే వ్యాధి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తోంది. ఈ డయాబెటిస్ ఉన్నవారు ఏది తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు.

ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా అంత తొందరగా మానవు. అందువల్ల డయాబెటిస్ పేషెంట్ లో తినే విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అలాగే శరీరంలో ఉన్న షుగర్ ని తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మెడికల్ మెడిసిన్స్, ఆయుర్వేద మెడిసిన్స్, వంటింటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే సుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిన తర్వాత చనిపోయే అంతవరకుపోదు. అయితే షుగర్ వ్యాధిని అంతం చేసే మందులు ఇంకా కనుగొనలేదు.

కానీ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకునే మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ షుగర్ ని మనం వంటింట్లో దొరికే కొన్ని రకాల వాటితో అదుపులో ఉంచుకోవచ్చు. అటువంటి వాటిలో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకు షుగర్ ని నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది అంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజు 8 నుంచి 10 కరివేపాకు ఆకులను తినడం వల్ల మూడు నెలల కాలంలో షుగర్ వ్యాధి స్థాయిలో మార్పులు గమనించవచ్చు. ఇలా కరివేపాకుని తీసుకోవడం వల్ల కూడా బరువును కూడా నియంత్రించుకోవచ్చు. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఉసిరికాయ కూడా ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించాలి అంటే ఉసిరి ఒక చక్కటి పరిష్కారం. ఉసిరికాయను పచ్చిగా లేదంటే, కాకరకాయ రసంతో కలిపి రెండు లేదా మూడు నెలలపాటు తీసుకుంటే మార్పును గమనించవచ్చు.