Site icon HashtagU Telugu

Cucumber Juice: అధిక బరువుకు చెక్ పెట్టాలంటే కీరదోస జ్యూస్ తాగాల్సిందే?

Mixcollage 11 Feb 2024 03 45 Pm 5595

Mixcollage 11 Feb 2024 03 45 Pm 5595

వేసవికాలంలో మనకు ఎక్కువగా దొరికే పండ్లలో కీర దోసకాయ కూడా ఒకటి. ఈ కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరుచుగా తీసుకుంటూ ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కీరదోసకాయను కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కీర దోసకాయ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొంతమంది కీర దోసకాయ అలాగే తింటే మరికొందరు జ్యూస్ చేసుకుని మరి తాగుతూ ఉంటారు.

అలా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి.. ముందుగా ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. కీర దోసకాయ ముక్కల్లో ఒక నిమ్మకాయ రసంను పూర్తిగా పిండాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్, ఒక కప్పు నీటిలో ఆ మిశ్రమం వేయాలి. అనంతరం అన్నింటిని మిక్సీ పడితే జ్యూస్ రెడీ. దీన్ని రోజు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. కీరదోస జ్యూస్ ను రోజు తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అలాగే బాన పొట్ట కరిగిపోతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి శరీరం శుభ్రంగా మారుతుంది.

శరీరంలో అతిగా ఉండే నీరు తొలగిపోతుంది. సాధారణమైన కీరాలో సాధారణ గుణాలు ఉన్నాయి. కీరా లో శరీరానికి కావాల్సిన అనేక విటమిన్లు ఉన్నాయి. ఈ కీరాలో మెగ్నీషియం, సిలికాన్ తో పాటు ఇంకా అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఉండటం వల్ల శరీరం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. మనకు రక్షణ కలుగుతుంది. ప్రతిరోజు కొన్ని కీర ముక్కల్ని తినడం వలన బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి.

Exit mobile version