Site icon HashtagU Telugu

Beauty Tips: కీరదోసకాయతో మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా!

Mixcollage 18 Jul 2024 02 33 Pm 6509

Mixcollage 18 Jul 2024 02 33 Pm 6509

మామూలుగా స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. పురుషులు అంతగా ఈ విషయం గురించి పట్టించుకోకపోయినా స్త్రీలు మాత్రం అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగించడంతో పాటు బ్యూటీ పార్లర్ కు వెళ్లడం హోం రెమిడీస్ ఫాలో అవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్ది అందం విషయంలో సమస్యలు రావడం అన్నది సహజం. అలాగే మనం చేత చిన్న చిన్న పొరపాట్లు అందుకు కారణం కావచ్చు. ఇకపోతే అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కానీ ఎప్పుడైనా కీర దోసకాయతో ఈ రెమిడీలు ట్రై చేశారా. ఒకవేళ ట్రై చేయకపోతే వెంటనే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. మరి కీర దోసకాయతో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే… అందాన్ని రెట్టింపు చేయడంలో కీరదోసకాయ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కీరదోసకాయ ముక్కల్ని కళ్లపై పెట్టుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే అలోవెరా జెల్‌ కూడా అందానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ జెల్ లో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ బి ఉన్నాయి. ఇవి చర్మానికి సమృద్ధిగా పోషణను అందిస్తాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. కీర దోసకాయ విషయానికి వస్తే.. కీరదోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి..ఇందులో ఉండే ఎలిమెంట్స్ చర్మాన్ని డీప్ క్లీనింగ్ చేయడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ముఖంపై రంధ్రాల పరిమాణం పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అయితే ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో దోసకాయ తొక్క తీసి బాగా రుబ్బుకోవాలి.

కలబంద జెల్‌ను తీసుకొని రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల పాటు ముఖంపై అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీరు కాటన్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి మూడుసార్లు ట్రై చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే అలోవెరానీ డైరెక్ట్ గా కూడా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు వంటి సమస్యలనుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.