Site icon HashtagU Telugu

Cucumber benefits: వేసవిలో దోసకాయ.. ఆరోగ్యంతో పాటు ఆ సమస్యలకు చెక్?

Cucumber Benefits

Cucumber Benefits

వేసవికాలంలో మనకు ఎక్కువగా దొరికే వాటిలో దోసకాయ కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా దోసకాయను ఇష్టపడి తింటూ ఉంటారు. దోసకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా వేసవిలో తీసుకోవలసిన వాటిలో దోసకాయ కూడా ఒకటి. దోసకాయని కీరదోసకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. దోసకాయను వేసవిలో తీసుకోవడం వల్ల ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. మరి వేసవిలో దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా దోసకాయలు 95% నీరు ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దోసకాయ శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని నీరు శరీరాన్ని శుభ్రపరచడానికి శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి. దోసకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ రక్తపోటును తగ్గించడమే కాకుండా మూత్రవిసర్జన లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అదనంగా, పొటాషియం మరియు నీటి కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కీరదోసకాయలో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. కుకుర్బిటాసిన్ బి అనేది దోసకాయలో సమృద్ధిగా ఉండే సహజ పదార్ధం.

దీనిలో, అపోప్టోసిస్-ఇండక్షన్ ఏర్పడుతుంది.ఇది వివిధ మానవ క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడుతుంది. దోసకాయ మలబద్ధకం సమస్యను నయం చేస్తుంది. పొట్టలోని టాక్సిన్స్ ను తొలగించి, కోలన్ క్యాన్సర్ ను కొంత వరకు నివారిస్తుంది. అలాగే దోసకాయ రక్త పోటును నియంత్రిస్తుంది. దోసకాయను ఫైబర్, మెగ్నీషియం పొటాషియం యొక్క పవర్ హౌస్ గా చెప్పవచ్చు ఈ పోషకాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. దోసకాయలో పొటాషియం మరియు నీరు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా, అవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.