Cranberry Juice: క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసా..?

క్రాన్ బెర్రీ...వీటి గురించి ఎంత మందికి తెలుసు.? ఈ జ్యూస్ తాగితే...కలిగే లాభాల గురించి అసలు తెలుసా..?

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 02:46 PM IST

క్రాన్ బెర్రీ…వీటి గురించి ఎంత మందికి తెలుసు.? ఈ జ్యూస్ తాగితే…కలిగే లాభాల గురించి అసలు తెలుసా..? చాలా మందికి తెలియదు. సాధారణంగా ఇందులో నీరు, చక్కెర మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే…చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం.

దంత సమస్యలను తగ్గిస్తుంది
క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే..దంత సమస్యలు తగ్గుతాయట. కేవిటిని నివారించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో గడ్డలు రాకుండా నివారిస్తుంది. క్రాన్ బెర్రీస్ లో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాక కారణంగా…ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్స్ శరీరంలో గడ్డలు రాకుండా చేస్తుంది. క్యాన్సర్ కణాల కణితులను ఏర్పరచకుండా నిరోధిస్తుంది. అంతేకాదు హైడ్రాక్సీ బెండాయిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టడాన్ని వాపును తగ్గిస్తుంది.

జీర్ణక్రియను పునరుద్దరించడంలో..
క్రాన్ బెర్రీ జ్యూస్ జీర్ణక్రియను పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రేగు వ్యవస్థను కూడా రక్షిస్తుంది. ప్రేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం ఇందులో ఉంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ వ్యాయామం చేయలేని వారు ఈ జ్యూస్ తాగితే…శరీరంలో ఏర్పడే చెడు కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు.

పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు…
ఈ క్రాన్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి , ఇ, కెరోటిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు…శరీరంలో ఏర్పడే సెల్ డ్యామేజ్ ను అరికడతాయి. క్యాన్సర్ ను నిరోధించడంలోనూ క్రాన్ బెర్రీస్ ముందుంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణాశయాంతర రుగ్మతలు తగ్గుతాయని చెబుతున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్…
కడుపులో ఏర్పడే పుండ్లు గ్యాస్ట్రిక్ సమస్యలతోపాటుగా..అల్సర్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. క్రాన్ బెర్రీస్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మెదడును మెదడు కణాలను రక్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక వేసవిలో చల్ల చల్లని క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.