Site icon HashtagU Telugu

Soft Lips: ఈ సింపుల్ చిట్కాలతో చలికాలంలో పగిలిన పెదవులకు చెక్!

Soft Lips

Soft Lips

‎Soft Lips: చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలతో పాటు పగిలిన పెదవుల సమస్య కూడా తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పగిలిన పెదవుల నుంచి కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. అయితే పగిలిన పెదాల కోసం లిప్ బామ్, వ్యాసిలిన్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కలగవు. అయితే ఇలా పగిలిన పెదవుల సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా చలికాలంలో పెదవులు పగలడానికి చాలా కారణాలు ఉంటాయి. చలికి పగలడం సాధారణం.

‎కానీ కొందరికి సంవత్సరం మొత్తం పగిలే ఉంటాయి. అందుకు ముఖ్య కారణం డీహైడ్రేషన్​. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఆ ప్రభావం పెదవులపై పడుతుందట. చల్లని గాలి, ఎసి, హీటర్ ఎక్కువగా వాడటం వల్ల కూడా పెదవులు పగులుతాయట. కొందరికి తరచూ పెదవులను నాలుకతో తడిపే అలవాటు ఉంటుంది. అందువల్ల కూడా పెదవులు చిట్లి రక్తం కారుతుందట. అంతేకాదు, విటమిన్​ బి, ఐరన్​, జింక్​ లోపం వల్ల కూడా పెదవులు పగులుతాయట. తక్కువ ధర లిప్​బామ్​ లలో ఉండే పెట్రోలియం జెల్లీ కూడా పెదవులు పగిలేందుకు కారణం అని చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. చిన్న బౌల్‌ లో 1 టీస్పూన్ షుగర్, అర టీస్పూన్ తేనె కలిపి పెదవులపై 30 సెకన్లు సున్నితంగా రుద్దాలట. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయట.

‎ మాశ్చరైజేషన్​ కోసం తాజా అరటి పండు ముక్కను పెదవులపై పది నిమిషాల పాటు రుద్ది రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే శుభ్రంగా కడిగేయాలట. ఇలా చేయడం వల్ల పెదాల మీదున్న పగిలిన చర్మం పోయి మృదువుగా మారతాయట. రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నెయ్యి పెదాల మీద రాసి పడుకున్నా మంచి ఫలితం ఉంటుందని, ఆవాల నూనె, తేనె కలిపి కూడా రాయవచ్చని చెబుతున్నారు. పెదాల మెరుపు పెంచాలంటే శరీరం లోపల నుంచీ సమస్యను పరిష్కరించాలట. రోజూ ఉదయం ఒక టీ స్పూన్ ఆముదం తాగితే శరీరం లోపలి నుంచి హైడ్రేషన్ అవుతుందని, పెదవులపై దానిమ్మ గింజలు రుద్దితే సహజంగా గులాబీ రంగులోకి మారతాయని చెబుతున్నారు. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి రోజూ రాయడం వల్ల మృదువుగా మారతాయట. అలోవెరా జెల్​ ని ఫ్రిజ్​ లో పెట్టి తరచుగా పెదవులపై రాస్తే దీర్ఘకాలిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు. వీటిని పాటించడంతో పాటు రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్​ బారిన పడకుండా ఉంటుందట. కొందరు చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుందని నీరు ఎక్కువగా తాగరు. అలాంటి వారు తప్పకుండా చలికాలంలో తగినన్ని నీరు తీసుకోవాలని చెబుతున్నారు.

Exit mobile version