Site icon HashtagU Telugu

Heart Attack: గుండెపోటు వచ్చిన వ్యక్తికి CPR చేసి ప్రాణాలు ఎలా కాపాడాలి.. సిపిఆర్ అంటే ఏమిటో తెలుసా?

Mixcollage 11 Dec 2023 04 32 Pm 7647

Mixcollage 11 Dec 2023 04 32 Pm 7647

ప్రస్తుత రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ చనిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి పది మరణాలలో రెండు మూడు మరణాలు హార్ట్ ఎటాక్ వే ఉంటున్నాయి. అయితే ఈ హార్ట్ ఎటాక్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఈ గుండె సంబంధిత సమస్యలకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజు రోజుకి వాటి సమస్యలు వాటి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మామూలుగా గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే చికిత్సగా చాలామంది సిపిఆర్ చేస్తూ ఉంటారు. ఎటువంటి వారికి సిపిఆర్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది.

ఇంతకీ అసలు సిపిఆర్ అంటే ఏమిటి? గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఈ సిపిఆర్ చేసి ఎలా కాపాడాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరి రీససి టేషన్. గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు ఆగిపోయిన వాళ్లకి వెంటనే చేసేందుకు వాడుతూ ఉంటారు. గుండెకు పంపింగ్ చేస్తూ అదే సమయంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకొనేలా చేస్తూ ఉంటారు. దీనికోసం వ్యాధిగ్రస్తుడు నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందిస్తూ ఉంటారు. పిల్లలకి మాత్రం ఛాతి మధ్యలో ఒక చేతితోనే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక శిశువుల విషయానికి వస్తే చాతి మధ్యలో రెండు వేళ్ళతో మాత్రమే మెల్లగా అదుపుతూ ఉండాలి.

రెండు చేతులతో చాతి మధ్యలో బలంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా 30 సార్లు వరుసగా చేస్తూ ఉండాలి. మధ్యలో నోటితో పేషెంట్ నోట్లోకి శ్వాసను ఇస్తూ ఉండాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేస్తూనే ఉండాలి. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు గురి అయిన మనిషికి నేలపై వెళ్లేలకలా పడుకోబెట్టాలి. సిపిఆర్ చేయడం వలన చాలామంది బ్రతుకుతారు. సిపిఆర్ ఆగిపోయిన శరీర భాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చేస్తుంది. అలాగే మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. సిపిఆర్ చేస్తే పేషెంట్ రెండు నిమిషాలలోనే కోలుకునే అవకాశం ఉంటుంది. చాలామందికి ఎలక్ట్రిక్ షాక్ లాంటిది అవసరం పడుతుంది. అటువంటి వాళ్ళు కోలుకోవడానికి కనీసం అరగంట పైన సమయం పట్టి ఛాన్స్ ఉంటుంది.

కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు అందరికీ సిపిఆర్ తప్పకుండా అవసరమే అయితే ఎటువంటి వాళ్లకు సిపిఆర్ అవసరమో తెలుసుకొని ఉండాలి. సహజంగా రెండు సమయాలలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది ఒకటి గుండె కొట్టుకోవడం చాలా తగ్గిపోతుంది. హార్ట్ బీట్ ఉండదు రక్తం సరఫరా ఆగిపోతుంది. ఇటువంటి వాళ్లకి ఈసీజీ స్ట్రైన్ లైన్ వస్తుంది. ఇటువంటి వాళ్లకి సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రెండవది.. గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం సహజంగా గుండె నిమిషానికి 50 నుంచి 8 సార్లు కొట్టుకుంటుంది. ఈ సమయంలో గుండెపోటు రెండువేల కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత గుండె అలిసిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. అటువంటి సమయంలో మరణం తప్పదని వైద్యులు చెబుతూ ఉంటారు. అటువంటి టైంలో వాళ్లకు సిపిఆర్ చేస్తే బతికే అవకాశం ఉంటుంది.