Frozen Meat and Corona: ఫ్రిజ్లో పెట్టిన మాంసంపై కరోనా.. 30 రోజుల పాటు బతికే ఉంటుందట?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు

  • Written By:
  • Updated On - July 12, 2022 / 11:25 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కరోనా వైరస్ అనుకున్న దాని కంటే ఎక్కువ శాతం లో విస్తరించుచుండడంతో ఇటీవల శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరిపారు. ఈ పరిశోధనల్లో ఒకరికొకరు సంబంధం లేకుండా, మాట్లాడకుండా, కలుసుకోకుండా ఉన్నప్పటికీ కూడా కరోనా వైరస్ విస్తరిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఎందుకు గల కారణాలు ఏంటి అన్న విషయం గురించి అంశాలను పరిశీలించగా అందులో భాగంగా కొన్ని విషయాలు బయటకు పడ్డాయి.

చికెన్, మటన్, చేపలు ఇలా మాంసాహారాలు మార్కెట్ నుంచి సేకరించి వాటిపై కొన్ని రకాల కరోనా వైరస్ లను ప్రసరింపజేసి వాటిని ఫ్రిడ్జ్ లో,డీ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచారు. ఆపై కొద్దిరోజుల తర్వాత వాటిని పరిశీలించగా మాంసం పై కరోనా తరహా వైరస్లు సజీవంగానే ఉన్నట్లు గుర్తించారు. డీప్ ఫ్రిజ్ లో ఉంచినప్పుడు వైరస్ యధావిధిగా ఉన్నప్పటికీ దానిని బయటకు తీసిన వెంటనే యాక్టివ్గా మారి ప్రతిపత్తిని చేసుకోవడం మొదలుపెట్టాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికా క్యాంపు బెయిల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమిలీ బైలీ తెలిపారు.

ఫ్రిజ్లో పెట్టిన మాంసం పై కరోనా వైరస్ నెల రోజులకు పైగా జీవించి ఉండగలదని వారు పేర్కొన్నారు. అయితే ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి ఆయా దేశాల్లో ప్యాకేజ్డ్ మాంసం వినియోగించడమే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న సమయంలో మాంసం ఉత్పత్తుల విషయంలో శుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యంగా మాంసం ప్రాసెస్ చేసే ప్రాంతాలు అక్కడి పనిచేసే వారు పరిశుభ్రతను పాటించాలి అని శాస్త్రవేత్తలు తెలిపారు.