Site icon HashtagU Telugu

Covid Vaccine : కోవిన్ టీకాలకు పిల్ల‌ల న‌మోదు ఇలా..

టీకాలు వేయించుకోవ‌డానికి ముందుగా CoWIN ప్లాట్‌ఫారమ్‌లో పిల్లలు న‌మోదు చేసుకోవాలి. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడాన్ని ప్రారంభిస్తారు. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభించే ఈ వ్యాక్సిన్ కోసం కోవిన్ సైట్ ల‌కి వెళ్లి న‌మోదు చేసుకోవాలి. ప్రస్తుతానికి, CoWIN ప్లాట్‌ఫారమ్‌లో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఎంపిక మాత్రమే ఉంది. డిసెంబర్ 25న, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం కోవాక్సిన్‌ను ఆమోదించింది. Zydus Cadila యొక్క ZyCoV-D టీకా పిల్లల కోసం కూడా ఆమోదించబడినప్పటికీ, ఇది మొదట పెద్దలకు మాత్రమే ల‌భిస్తుంది. పిల్లలు వారి కుటుంబ సభ్యులతో నమోదు చేసుకోవచ్చు లేదా విడిగా కూడా నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ వారికి ఆధార్ కార్డ్ లేకపోతే, పిల్లలు తమ స్టూడెంట్ ఐడి కార్డులతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ కుటుంబంలోని నలుగురు సభ్యులను నమోదు చేసుకోవచ్చు. పిల్లలు టీకా కోసం సమీపంలోని ఆమోదించబడిన కేంద్రానికి వెళ్లాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.

Exit mobile version