Booster: మళ్లీ కరోనా ఫీయర్.. రాష్ట్రంలో బూస్టర్ డోస్‌లు పంపిణీ!

కోవిడ్ బూస్టర్ డోస్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి బూస్టర్ డోస్ వాక్సిన్‌లను వేయాలని నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 06:57 PM IST

Booster: కోవిడ్ బూస్టర్ డోస్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి బూస్టర్ డోస్ వాక్సిన్‌లను వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా బూస్టర్ డోస్ లను వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండగా.. రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగే అవకావముంది. దీంతో బూస్టర్ డోస్ లను వేసే ప్రక్రియను ఆరోగ్యశాఖ స్పీడప్ చేసింది.

బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బూస్టర్ డోస్ లను వైద్య సిబ్బంది వేయనున్నారు. బూస్టర్ డోస్ లను అందుబాటులోకి ఉంచనున్నారు. అవసరమైన వాళ్లు వచ్చి బూస్టర్ డోస్ వేయించుకోవచ్చని వైద్యశాఖ తెలిపింది. ఉచితంగా వ్యాక్సిన్లను వేయనున్నట్లు తెలిపింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. తాము ఇక పంపిణీ చేయబోమని, రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ల ఖర్చును భరించనుంది.

5 లక్షల కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్ డోస్‌లను పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మెదటి రెండు డోస్‌లు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా.. మూడో డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు గతంలో తరహాలో ఇప్పుడు ఎక్కువమంది వ్యాక్సిన్ల కోసం పోటీ పడటం లేదు. వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. కానీ కరోనా కేసుల పెరుగుదల కారణంగా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో రోజు 10వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలోని చాలా రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సిన్లు వేస్తున్నాయి.