Site icon HashtagU Telugu

Corn: వామ్మో.. మొక్కజొన్న వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలా..?

Corn

Health Benefits of Corn Mokkajonna

Corn: మొక్కజొన్న (Corn).. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ మొక్క జొన్నను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మొక్కజొన్న వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. కొందరు ఉడికించిన మొక్కజొన్నను తినడానికి ఇష్టపడితే మరికొందరు కాల్చిన మొక్కజొన్నలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవి మనకు ఎక్కువగా వర్షాకాలంలో బాగా రోడ్లపై దొరుకుతూ ఉంటాయి. కానీ రాను రాను మార్కెట్లో ఈ మొక్కజొన్నలు ఏడాది పొడవునా లభిస్తున్నాయి. మొక్కజొన్న లో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ఈ మొక్కజొన్నల వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొక్కజొన్న తినడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా ఉంచడంతోపాటు వృద్ధాప్యాన్ని తొందరగా రానివ్వకుండా చర్మాన్ని కాపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు అలసట లేకుండా చేస్తాయి. వీటిలో ఐరన్ మెగ్నీషియం ఉండడం వల్ల కీళ్ల నొప్పులు దరిచేరవు.

Also Read: Coconut Oil For Skin: శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనెతో ఇలా చేయండి..!

వృద్ధులు తరచూ ఉడికించిన మొక్కజొన్న తింటూ ఉండడం వల్ల కీళ్ల నొప్పులు రావు. అలాగే మొక్కజొన్న మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు ఈ స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తహీనత సమస్య రాకుండా ఉండాలంటే స్వీట్ కార్న్ తరచూ తీసుకుంటూ ఉండాలి. మొక్కజొన్నలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కళ్ళ వ్యాధులు దరిచేరకుండా కంటిని కాపాడుతుంది. స్వీట్ కార్న్ లో ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మొక్కజొన్న తినటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు కూడా గట్టిగా ఉండేలా చేస్తుంది. తద్వారా జుట్టు రాలిపోవడం సమస్య నుండి కాపాడుతుంది. స్వీట్ కార్న్ విత్తనాలు తరచూ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొటిమలు సమస్యతో ఇబ్బంది పడేవారు మొక్కజొన్నలను కాస్త పేస్టులా నూరి ఆ మొటిమలపై అప్లై చేయడం వల్ల తొందరగా మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు.