మన వంటింట్లో దొరికింది ఆకుకూరల్లో కొత్తిమీర కూడా ఒకటి. ఈ కొత్తిమీరను మనం నిత్యం వినియోగిస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క కూర తయారీలో కొత్తిమీర నా తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. కొత్తిమీర వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మన ఆహారంలో కొత్తిమీరను భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే కోతిమీర వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తిమీర మన జీర్ణవ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొత్తిమీర ఆకులు వికారానికి, అజీర్ణ సమస్యలు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు నివారణ అవుతాయి. కొత్తిమీరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎక్కువ హైబీపీతో బాధపడుతున్న వారు బీపీ నుండి ఉపశమనం పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. కొత్తిమీరలో ఉండే సుగుణాలు హైబీపీ నుంచి, గుండెపోటు ప్రమాదం నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా కొత్తిమీరని వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొత్తిమీరను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకునే వారికి ఎముకలు గట్టిగా ఉంటాయి.
కొత్తిమీర లో ఉండే కాల్షియం, మినరల్స్ ఎముకలు బలంగా ఉంచడమే కాకుండా, ఎముకల రిగ్రోత్ కు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్తిమీరను నిత్య ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అది మన శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అలాగే నరాలకు సంబంధించిన అనేక సమస్యలకు కొత్తిమీర మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. రెగ్యులర్ గా కొత్తిమీర ఉన్న ఆహారంలో తీసుకోవడం వల్ల అల్జీమర్స్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కొత్తిమీరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. కొత్తిమీర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంతోపాటు, బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలోనూ కొత్తిమీర గణనీయమైన పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా కొత్తిమీర కళ్ళకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్ కంటి సమస్యలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్ కంటి మీద ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వయసు పెరగడం వల్ల వచ్చే అనేక సమస్యలకు చెక్ పెడుతుంది.అంతే కాదు కొత్తిమీర నోటి అల్సర్లను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.