Site icon HashtagU Telugu

Cool Drinks: తియ్యగా ఉన్నాయి కదా అని కూల్స్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా?

Mixcollage 03 Mar 2024 10 24 Am 1334

Mixcollage 03 Mar 2024 10 24 Am 1334

వేసవికాలం వచ్చింది అంటే చాలు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ తాగినా, ఎన్ని నీళ్లు తాగినా కూడా దాహం తీరదు. అయితే చాలామంది నీళ్లకు బదులుగా వేసవికాలంలో ఎక్కువగా కూల్ డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా కొన్ని వ్యాపార సంస్థలు కూల్డ్రింక్స్ తక్కువ చక్కెర కలిగిన ఆహారాలలో విస్తృతంగా వాడుతున్నారు. ఈ కృత్రిమ స్వీట్నర్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కాఫీ టీలో వాడే కృత్రిమ టాబ్లెట్స్ అంత ప్రమాదకారి కాదని తెలిపారు.

ఈ శీతలపానియాలలో వాడే కృత్రిమ తీపి కార్ట్ నోమా అని పిలవబడే కాలేయ క్యాన్సర్ కు కారణం అవుతుంది. శీతలపానీయాలలో వాడే ఈ కృత్రిమ తీపు వలన క్యాన్సర్ ముప్పు తప్పదని డబ్ల్యు హెచ్ ఓ తెలిపారు. అయితే ఎక్కువ మోతాదులో ఈ కూల్డ్రింక్స్ తీసుకుంటే ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు చెప్తున్నారు. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, అలాగే పేగు ఇన్ఫెక్షన్ వంటివి అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం మంచిది.

అలాగే వేసవికాలంలో మీరు చల్లగా ఏవైనా తాగాలి అనుకుంటే కుండలో నీరు అన్నిటికంటే చాలా మంచిది అని చెప్పవచ్చు. అలాగే మజ్జిగ వంటివి తీసుకోవడం కూడా మంచిది. ఇకపోతే వేసవికాలంలో ఫ్రిజ్లో నీళ్లు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. కొంతమంది గడ్డలు కట్టే విధంగా ఉన్న నీటిని కూడా సునాయాసంగా తాగేస్తూ ఉంటారు. అప్పుడు ఆ నీరు ఉపశమనం మరణించిన అవి నెమ్మదిగా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.