Site icon HashtagU Telugu

Cool Drinks: కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 17 Mar 2024 07 11 Pm 8908

Mixcollage 17 Mar 2024 07 11 Pm 8908

వేసవికాలం మొదలైంది. ఎండలు మండి పోతున్నాయి. దీంతో పదే పదే దాహం వేస్తూ ఉంటుంది. ఇక వేసవికాలం చాలా వరకు చాలామంది చల్లని పానీయాలు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. దైనందిన జీవితాలతో ఈ శీతల పానీయాలు అలా పెనవేసుకుపోయాయి. ఇవి కేవలం బరువును పెంచుతాయేకానీ ఎటువంటి ఉపయోగం ఉండదట. వైద్య నిపుణులు పానీయాలను అస్సలు తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. కానీ మనం వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మరి వేసవి కాలం కదా అని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటే మాత్రం అనేక రకాల సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు.

మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగుతున్న పురుషులకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతోంది. బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎముకల పెరుగుదలకు ఫాస్పరస్ ఎంతో ముఖ్యమైంది. ఎముకల అభివృద్ధికి తగినంత ఫాస్పరస్ తీసుకోవాలి. తక్కువ సీరం ఫాస్పేట్ స్థాయిలు పోషకాహార లోపాన్ని సూచిస్తాయి. బోలు ఎముకలు, ఎముకల పగుళ్లు లాంటి ప్రమాదాలను కూల్ డ్రింక్స్ పెంచుతాయి. మనిషి శరీరం ఎప్పుడూ దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు చాలా అవసరం. కూల్ డ్రింక్స్ పదే పదే తాగుతుండటం వల్ల ప్రొటీన్ లోపం తలెత్తుతుంది.

శీతల పానీయాలను తాగేబదులుగా పుచ్చకాయ, కర్చూజ లాంటి పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని పంచదార లేకుండా తాగితే ఇంకా మంచిందంటున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగతూ ఉండాలి. అప్పుడు ఎముకలకు నష్టం జరగకుండా ఉండటానికి కాల్షియం తోడ్పడుతుంది. శరీరంలో యాసిడ్ బేస్ స్థాయిలను నియంత్రిస్తుంది. చల్లటి శీతల పానీయాలు మన ఆహారంలోని క్యాల్షియంను మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న కాల్షియంను కూడా హరించి వేస్తాయి కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా శీతల పానీయాలు తీసుకోకపోవడం మంచిది.