Site icon HashtagU Telugu

Cooking Oil: వాడిని నూనెను మళ్ళీ మళ్ళీఉపయోగిస్తున్నారా.. అయితే ఇది ఎంత డేంజర్ లో తెలుసా?

Cooking Oil

Cooking Oil

మామూలుగా ప్రస్తుతం నూనెల ధరలు మండిపోతున్నాయి కాబట్టి నూనె మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం అన్నది కామన్. ఇంట్లో సంగతి పక్కన పెడితే బయట అయితే పదేపదే అదే నూనె రిపీట్ చేయడం వల్ల నూనె నల్లగా అయిపోయినా కూడా అలాగే ఆ నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. పూరీలో పకోడీలు గారెలు చికెన్ పకోడా ఇలా రకరకాల ఐటమ్స్ ని నూనెలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ నూనెలను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో ఆ నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. నూనెని పారబోయలేం కాబట్టి దీంతో చాలా మంది అదే నూనెల్ని వంటల్లో వాడతారు. మరి ఉపయోగించిన నూనె మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నూనెల్ని మళ్లీ తిరిగి వాడడం వల్ల డయాబెటిస్, రక్తపోటు, గుండె సమస్యల వంటి సమస్యలు వస్తాయట. వంటనూనెల్ని మళ్లీ వేడి చేస్తే విషపూరిత పదార్థాలు విడుదలవుతాయట. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయట. దీనివల్ల మంట, అనేక సమస్యలు వస్తాయని, అందుకే ఈ నూనెల్ని మళ్లీ వాడకుండా చూడడం మంచిది. అయితే కొన్నిసార్లు మళ్లీ వాడవచ్చట. ట్రాన్స్‌ఫ్యాట్స్ ఏర్పడకుండా ఉంటే దానిని తిరిగి 3 సార్లు వాడవచ్చట. నూనెని ఎక్కువగా వేడిచేసి మళ్లీ మళ్లీ వాడితే ట్రాన్స్ ఫ్యాట్స్ పరిమాణం పెరుగతాయట. మన ఆహారాన్ని అనారోగ్యకరంగా చేసే నూనెని తిరిగి వాడినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ పరిమాణం పెరుగుతుందట. అలాంటి నూనెలో వండిన ఆహారాన్ని తీసుకుంటే హానికరమైన ప్రభావాలు ఉంటాయట.

దీని వల్ల విషపూరిత పదార్థాలు విడుదలవుతాయట. అలాగే దుర్వాసన కూడా వస్తుందట. అధిక ఉష్ణోగ్రతల్లో వేడి చేస్తే నూనె విషపూరిత పొగను విడుదల చేస్తుందట. పొగబిందువు చేరుకోవడానికి ముందే పొగలు వెలువడుతాయని, కానీ ఉష్ణోగ్రత పొగ బిందువు కంటే ఎక్కువగా ఉంటే పెరుగుతాయని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే నూనెలోని కొన్ని కొవ్వులు ట్రాన్స్‌ఫ్యాట్స్‌గగా మారి గుండె సమస్యలకి కారణమవుతాయట. ప్రతీసారి వేడి చేయడం వల్ల విష వాయువులు విడుదలై ఆహారాన్ని ప్రమాదకరంగా మారుస్తాయని, ఇలా మరోసారి వేడిచేసిన నూనెలతో వండిన వంటలు తినడం వల్ల చాలా సమస్యకు వస్తాయని, కాబట్టి వీటిని తగ్గించడం మంచిదని చెబుతున్నారు..