Site icon HashtagU Telugu

Jamun: అల‌ర్ట్‌.. ఈ పండు ఉద‌యాన్నే తింటే డేంజ‌ర్‌!

Jamun

Jamun

Jamun: నేరేడు అనేది ఒకటి కాదు అనేక వ్యాధులకు చికిత్సగా పరిగణించబడే ఫలం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, జంబోలిన్‌తో నిండి ఉన్న నేరేడు (Jamun) ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే, గ్లూకోజ్, జీవక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. డయాబెటిస్ నివారణ కోసం మీ ఆహారంలో నేరేడును చేర్చుకోవచ్చు. నేరేడు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎలా సహాయపడుతుందో ప‌లువురు వైద్యులు సూచించారు. అలాగే దీనిని తినడం వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పారు. నేరేడు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

నేరేడులోని పోషకాలు

నేరేడు పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, విటమిన్ సి, పుష్కలంగా విటమిన్ బి లభిస్తాయి. అంతేకాకుండా థయామిన్, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి6 వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read: Jeep Discount: ఈ కారు మోడ‌ళ్ల‌పై భారీగా ఆఫ‌ర్లు.. దాదాపు రూ. 4 ల‌క్ష‌లు త‌గ్గింపు!

నేరేడు తినడం వల్ల ప్రయోజనాలు

జీర్ణక్రియ సమస్యలకు పరిష్కారం: నేరేడులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ సమృద్ధిగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన దాదాపు అన్ని ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. దీనిని తినడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి వంటి పొట్టకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుదల: నేరేడులో పొటాషియం, ఐర‌న్‌, కాల్షియం, విటమిన్ సి ఉన్నాయి., ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.

ఆర్థరైటిస్ నొప్పి నివారణ: వైద్య నిపుణులు అభిప్రాయం ప్ర‌కారం.. కీళ్ల‌నొప్పులు లేదా ఆర్థరైటిస్ నొప్పితో బాధపడేవారు నేరేడు బెరడును మరిగించి, దాని ద్రవాన్ని కీళ్లపై లేపనంగా రాయవచ్చు. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మసూళ్ల సమస్యలకు పరిష్కారం: నేరేడు ఆకులు, బెరడు మసూళ్ల సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల తక్కువ కేలరీలతో రక్తపోటును నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

చర్మం, కళ్లకు మేలు: నేరేడులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం, కళ్లకు ప్రయోజనకరం. వర్షాకాలంలో లభించే ఈ ఫలం ఒక ఔషధం వలె పనిచేస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతూ చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది.

గుండె ఆరోగ్యం: నేరేడు హానికరమైన ప్రభావాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. వర్షాకాలంలో లభించే ఈ పండు గుండెకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.

జాగ్రత్తలు