Health Tips: బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెల్లుల్లితో ఇలా చేయాల్సిందే!

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా బీపీని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది లో బీపీ అలాగే హై బీపీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా చాలామందిబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం ఎక్కువ శాతం టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు రకరకాల ఆహార పదార్థాలు తింటూ బిపిని కంట్రోల్ లో ఉంచుకుంటూ ఉంటారు. అయితే వెల్లుల్లి ఉపయోగించి కూడా బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెల్లుల్లి లో అల్లిసిన్, డయాలిల్ డై సల్ఫైడ్, డయాలిల్ ట్రై సల్ఫయిడ్, సల్ఫర్ సమ్మేళనాలు, ఖనిజాలు వంటివి ఉంటాయి.

అలాగే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇందులోని అల్లిసిన్ బ్లడ్ ప్రెషర్ ని నియంత్రించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుందట. పచ్చి వెల్లుల్లి ముక్కలుగా కోసినప్పుడు లేదా తినడం ద్వారా అలీనాజ్ విడుదలవుతుందట. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే ప్రతీ రోజు రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల అనేక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. వెల్లుల్లి కూరల్లో, టీ లో కూడా ఉపయోగించుకోవచ్చట. సలాడ్స్ లో తరిగిన వెల్లుల్లిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. దీనివలన అదనపు రుచి యాడ్ అవటంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

సలాడ్స్ కోసం ప్రత్యేకంగా సాల్టెడ్ వెల్లుల్లి అందుబాటులో ఉంటుందట. అంతేకాకుండా పులియపెట్టిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీ తో పాటు ఇతర సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. వెల్లుల్లి టీ తాగడం ద్వారా కూడా బీపీకి చెక్ పెట్టవచ్చట. అలాగే వెల్లుల్లి పొడి చేసుకొని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చట. అయితే బీపీ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

  Last Updated: 14 Oct 2024, 11:24 AM IST