Site icon HashtagU Telugu

Health Tips: పెరుగు, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

Mixcollage 20 Mar 2024 11 10 Pm 1144

Mixcollage 20 Mar 2024 11 10 Pm 1144

మనం తరచూ పెరుగును ఉపయోగిస్తూనే ఉంటాము. మజ్జిగ లేదా పెరుగన్నం అలాగే అనేక రకాల వంటల్లో కూడా పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ పెరుగును ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. కొందరు పెరుగులోకి ఉప్పు వేసుకొని మజ్జిగ చేసుకుని తాగితే మరి కొందరు చక్కెర వేసుకొని లస్సీ చేసుకొని తాగుతూ ఉంటారు. అయితే దీని కంటే పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.

పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవడంవల్ల క్యాల్షియం లభిస్తుంది. దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండెకు సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు రావు. కడుపు నొప్పి తగ్గుతుంది. పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది. త్వరగా ఆకలి వేయదు. ఇతర ఆహారాలపై దృష్టి వెళ్లదు. దీనివల్ల ఆహారాన్ని తీసుకునే విషయంలో నియంత్రణ పాటించినవారిమవుతాం. శరీరానికి పోషకాలతో పాటు శక్తి కూడా లభిస్తుంది. శరీరం పటిష్టంగా తయారవుతుంది.

బలహీనత, నీరసం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పెరుగు, బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. రాత్రివేళ తీసుకోకూడదు. రాత్రి వేళ అయితే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. రోజుకు ఒకసారి తీసుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయని, అందరూ పాటించాలి. పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల మహిళలకు పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ క్రాంప్ సమయంలో మహిళలు పెరుగులో బెల్లం కలిపి తినాలి. కడుపు తిమ్మిరిని కూడా తొలగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల చాలా మంది సీజనల్ గా వచ్చే వ్యాధులబారిన పడుతుంటారు. అటువంటివారు పెరుగు, బెల్లం కలిపి తీసుకోవడంవల్ల వీటినుంచి దూరంగా ఉంటారు.