మొలకెత్తిన గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే వైద్యులు కూడా వీటిని తినమని చెబుతూ ఉంటారు. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి6, విటమిన్ కె వంటివి ఎక్కువ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో పీచు, ఫోలేట్, ఒమేగా త్రీ, కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజువారి డైట్ లో వీటిని ఉపయోగించమని చెబుతుంటారు.
వీటిని తినటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడటంతో పాటుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయట. గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయని, అయితే వీటిని మనకి నచ్చినట్లుగా తినటం వలన ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. పచ్చి మొలకలలో హానికరమైన బ్యాక్టీరియా ఉండడం వలన 12 నుంచి 72 గంటలు దాటిన తర్వాత ఈ పచ్చి మొలకలు తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుందట. దీని వలన అతిసారం, కడుపునొప్పి, వాంతులు వంటివి కలుగుతాయి.
పచ్చి మొలకలని డైరెక్ట్ గా తినటానికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, వాటిని కొద్దిగా నూనెలో వేడి చేయడం వలన వాటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. నూనెలో వద్దనుకుంటే ఉప్పు నీటిలో ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెట్టాలి. ఈ విధంగా మొలకలను వాడటం వలన మీ జీర్ణవ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవట. అంతేకాకుండా మీ జీర్ణ వ్యవస్థ మరింత మెరుగ్గా పోషకాలను గ్రహిస్తుందని చెబుతున్నారు. అయితే మొలకెత్తిన గింజలు తినే విషయంలో ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.