Site icon HashtagU Telugu

Green Mirchi : పచ్చిమిర్చి కారంగా ఉంటుందని పక్కన పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 30 Jan 2024 06 54 Pm 5365

Mixcollage 30 Jan 2024 06 54 Pm 5365

ప్రతిరోజు మనం ఉపయోగించే వంటల్లో పచ్చిమిరపకాయలను తప్పకుండా వేస్తూ ఉంటాం. ఇవి కూరకు రుచిని పెంచుతాయి. పచ్చి మిరపకాయలు కూరల్లో తినడానికి కానీ నేరుగా తినడానికి అస్సలు సాహసం చేయరు. పొరపాటున అవి తిన్నారంటే ఇక అంతే సంగతులు. బాబోయ్ పచ్చిమిరపకాయ మాకొద్దు అని అంటారు. కొందరు సమోసా, పెరుగన్నం వంటి వాటిలోకి పచ్చిమిరపకాయలను నంచుకుని తింటూ ఉంటారు. మీకు తెలుసా పచ్చిమిరపకాయ కారంగా ఉండటం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.

అంతేకాకుండా పచ్చిమిర్చి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షిస్తుంది. పచ్చిమిర్చి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చిమిరపలో ఎ ,సి ,బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రొటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలో క్యాప్సైసిన్ అనే పదార్ధం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యాన్ని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయట. రక్తంలో చక్కెర స్ధాయిని కంట్రోల్ చేయడంలో ఇవి సమర్ధవంతంగా పనిచేస్తాయి. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు స్పైసీ ఫుడ్ తినాలనుకుంటే పచ్చి మిరపకాయతో చేసిన ఫుడ్ తీసుకోవచ్చు.ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చలికాలంలో ఎర్ర మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి పచ్చిమిరపకాయ కారంగా ఉంది అని పక్కన పెట్టేముందు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా తినేస్తారు.