Site icon HashtagU Telugu

Bones Strong: ఎముకలు బలంగా మారాలంటే ఈ ఆహారం తీసుకోవడం తప్పనిసరి?

Bone Density

Bone Density

సాధారణంగా ప్రతి జీవి శరీరం ఎముకల నిర్మాణం పై ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే మనిషి శరీరం కూడా ఎముకల పైనే ఆధారపడి ఉంటుంది. ఎముకలు లేకపోతే మనిషి నిటారుగా నిలబడలేడు,కూర్చోలేడు అసలు ఏ పని చేసుకోలేడు. కాబట్టి మనం ఎముకలను బలంగా దృఢంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మంచి మంచి ఆహారాన్ని, సరైన జాగ్రత్తలను పాటించాలి. ఇకపోతే ఎముకలు బలంగా ఉండాలి అంటే వాటికి సరైన క్యాల్షియం అందాలి. ఎముకలకు కావాల్సిన కాల్షియం పాలలో సమృద్ధిగా లభిస్తుంది. మనిషి బలంగా ఉండాలంటే తప్పకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.

లేదంటే ఎముకల్లో కాల్షియం లెవల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా కాస్త దూరంగా నడవగానే ఎముకలు నొప్పిస్తుంటాయి. మోకాళ్లు, మోచేతులు లాగడం, నడుమునొప్పి, మెడ కండరాల నొప్పులు వస్తుంటాయి. ఎముకల్లో ఎప్పుడైతే బలం తగ్గిపోతుందో లేవడం, కూర్చోవడం కూడా అసాధ్యం. ఎముకలు త్వరగా పగుళ్లు ఏర్పడతాయి. ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎముకలు త్వరగా పగుళ్లు రావడంతో పాటు విరిగిపోతాయి. దీంతో ఎన్ని ఆపరేషన్లు చేసిన అవి అతకడం కష్టం. అందుకే బలమైన ఆహారం,ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.. కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. తమల పాకులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజు తిన్న తర్వాత 1 లేదా 2 తమల పాకులను తినాలి.

దాని వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అదేవిధంగా ఉదయం మాంసకృత్తులు ఉన్న ఆహారం, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు, పాలు, పచ్చి కొబ్బరి, పెరుగు, డ్రై ఫ్రూట్స్, సోయామిల్క్, బ్రెడ్, క్వినోవా,రైస్ బ్రాన్. బాదంపప్పు, జీడిపప్పు,గుమ్మడికాయ గింజలు, బెల్లం, నువ్వుల పట్టీలు, పల్లీలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకలు ధృడంగా మారుతాయి.

Exit mobile version