Constipation Remedies: మలబద్దకాన్ని చిటికెలో దూరం చేసే గింజలు.. అవేంటంటే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో మలబద్ధకం సమస్య కూడా ఒకటి. ఈ మలబద్ధకం

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 07:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో మలబద్ధకం సమస్య కూడా ఒకటి. ఈ మలబద్ధకం సమస్యకు ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు. ప్రస్తుతం బిజీబిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువ మంది ఇంట్లో చేసిన ఆహార పదార్థాలకు బదులుగా బయట దొరికే జంక్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు. ఈ బయట దొరికే ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల అనారోగ్య సమస్యలతో పాటు జీర్ణ సంబంధించిన సమస్యలు మలబద్ధకం సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బయట దొరికే ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని తెలిసి కూడా చాలామంది వాటిని అలాగే తింటూ ఉంటారు.

అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అంటే మనం పిండి పదార్థాలు, పీచు,కొవ్వు, మెగ్నీషియం ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అయితే పొట్ట సమస్యలతో పాటు మలబద్ధకం సమస్యల నుంచి బయటపడాలి అంటే అవిస గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎంతో మంచిది. మరి అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అవిసె గింజల్లో శరీరానికి కావలసిన ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సమస్యలను తగ్గించి బరువును సులభంగా నియంత్రిస్తుంది.

అంతేకాకుండా ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. అవిసె గింజలతో కేవలం మలబద్ధకం సమస్య మాత్రమే కొలెస్ట్రాల్ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. కొలెస్ట్రాల్ మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు అవిసె గింజలు తినడం వల్ల అవి ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. ఈ అవిసె గింజలు మధుమేహాన్ని నియంత్రించడం మాత్రమే కాకుండా ఇందులో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తాయి. అలాగే చాలామంది బరువు తగ్గడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు అవిసె గింజలను ఉపయోగించడం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చు. ఉదయం సాయంత్రం వీటిని స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.