Conjunctivitis: ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న కళ్ళ కలక కేసులు

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సహజం. సీజనల్ వ్యాధుల్లో కళ్ళ కలక ఒకటి. ప్రస్తుతం తెలంగాణాలో ఈ వైరల్ బాధితుల సంఖ్య ఎక్కువవుతుందంటున్నారు డాక్టర్లు

Conjunctivitis: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సహజం. సీజనల్ వ్యాధుల్లో కళ్ళ కలక ఒకటి. ప్రస్తుతం తెలంగాణాలో ఈ వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువవుతుందంటున్నారు డాక్టర్లు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దీని భారీన పడుతున్నారు. హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి కళ్ళ కలక బాధితులు క్యూ కడుతున్నారు. ఒక నెల రోజుల్లో ఏపీ ,తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో 1000 కి పైగా కళ్ళ కలక కేసులు నమోదయ్యాయని ఎల్వి ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. సీజనల్ వ్యాధుల్లో ఇదొక సమస్య అని అంటున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది అడెనో వైరస్ తో వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ సమస్యేనని, కంటిచూపుకి ప్రమాదం ఉండదని భావిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడేవారి కళ్ళు ఎరుపెక్కడం, దురద సమస్యలు వస్తాయ. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్థాయి. ఇదొక అంటువ్యాధి. ఒకరినుంచి ఒకరికి వ్యాపింపజేస్తుంది. కళ్ళ కలక ఇన్ఫెక్ట్ అయితే ప్రమాదం లేకపోయినప్పటికీ కళ్ళను శుభ్రంగా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read: వరదలో మునిగిన జగనన్న కాలనీ లపై పవన్ ట్వీట్..