Site icon HashtagU Telugu

Fertility Problems : ఫెర్టిలిటి సమస్యలకు ఏ వైద్యుడిని సంప్రదించాలో తెలుసా..?

Fertiulity

Fertiulity

ఈ మధ్యకాలంలో చాలామంది దంపతులు పిల్లలను కనడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. గర్భం దాల్చడంలో మహిళలకే కాదు…పురుషులకు కూడా సమస్యలు షురూ అవుతున్నాయి. సాధారణంగా వంధ్యత్వం అనేది గర్భాశయంలో సమస్య కానీ లేదా కిడ్నీలో సమస్య ఉన్నట్లయితే ఇది గర్భం, ప్రసవ సమయంలో సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి గైనకాలజిస్టులు, యూరాలజిస్టులను సంప్రదిస్తారు.

ఇక సమస్య అనేది పిల్లల పుట్టుకలో మాత్రమే ఉన్నప్పుడు..ఆ కారణాలు వ్యక్తికి వ్యక్తికి మారే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి మీరు ఫెర్టిలిటి స్పెషలిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. సంతానోత్పత్తి నిపుణులు ప్రసూతి వైద్యులు, యూరాలజిస్టులు ప్రసవానికి సంక్లిష్టంగా ఉన్న అవరోధాలను కనుగొనడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అయితే సమస్యలన్నింటికీ ఒకే వైద్యుడిని సంప్రదించడం సరైందికాదు. ఎందుకంటే మీకు యోనిలో తిత్తి ఉంటే…గైనకాలజిస్టును సంప్రదించాలి. కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ల లోపం ఉంటే గైనకాలజిస్టు పరిష్కరించలేరు కదా.

ఎలాంటి సమస్యలకు మీరు ఫెర్టిలిటీ డాక్టర్ ను సంప్రదించాలో తెలుసుకుందాం…

ఆండ్రోలాజిస్ట్ :
మగ వంధ్యత్వానికి చికిత్స చేయడంలో యూరాలజిస్ట్ నైపుణ్యం కలిగి  ఉంటారు.  పునరుత్పత్తి  ఎండోక్రినాజిస్ట్ తో కలిసి పనిచేస్తారు. పురుషుల్లో వంధ్యత్వం అనేది స్పెర్మ్ లోపం, అంగస్తంభన, అకాల స్కలనం, ఇన్ఫెక్షన్ వంటి పలు సమస్యలకు అనుగుణంగా నిర్దారణ చేసి చికిత్స అందిస్తారు.

పునురుత్పత్తి ఎండోక్రినాలజిస్ట్ :
వీరు సంతానోత్పత్తి సమస్యలను నిర్థారించడంతోపాటు తగిన చికిత్సలను అందిస్తారు. సాధారణంగా, సంతానోత్పత్తి వైద్యులు ముఖ్యంగా సంతానోత్పత్తి మగ, ఆడ ఇద్దరిలోనూ జరుగుతుంది. సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు. స్త్రీకి సహజంగా గర్భం దాల్చడంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే…ఆమెకు ఎలాంటి సంతానోత్పత్తి చికిత్సలు సరైనవో నిర్ధారించుకోవడానికి వారు పలు పరీక్షలు నిర్వహిస్తారు.

గర్భస్రావం ఐవీఎఫ్ :
ఈవైద్య నిపుణనులు పునరుత్పత్తి ఆరోగ్యం, రోగనిరోధక శాస్త్రం రెండు రంగాల్లో ప్రత్యేకత కలిగి ఉంటారు. కొంతమందికి గర్భస్థ శిశువుకు గర్భం దాల్చడంలో సమస్యలు లేకుంగా గర్భస్రావం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రుత్రిమంగా గర్భం ధరించే ప్రయత్నం అనేది విఫలమవుతుంది. అటువంటి సమస్యలకు సరైన చికిత్స ను సూచించడానికి పునరుత్పత్తి రోగనిరోధక నిపుణుడి సహాయం అవసరం అవుతుంది. అదేవిధంగా స్వయం ప్రతిరక్షక రుగ్మతలతో వంధ్యత్వానికి ట్రీట్ మెంట్ అందిస్తారు.

పునరుత్పత్తి వైద్యుడు:
ఈ పరిస్థితి సాధారణంగా కొంతమందిని ఎక్కువగా ప్రభావితంచేస్తుంది. ఉదాహరణకు పురుషులకు వృషణాన్నితొలగించాల్సిన పరిస్థితిలో లేదా స్త్రీలకు సిస్ట్ లు ఎండో మెట్రియోసిస్ ను శస్త్ర చికిత్స్ ద్వారా మాత్రమే తొలగించాల్సిన పరిస్థితిలో ప్రత్యక సర్జర్లను చేయాల్సి ఉంటుంది.

Exit mobile version