Site icon HashtagU Telugu

Periods: నెలసరి సమయంలో స్త్రీలు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

Periods

Periods

మామూలుగా స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఈ పీరియడ్స్ సమయంలో స్త్రీలకు కడుపునొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ప్రతి నెల ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఈ పీరియడ్స్ సమయంలోనే తలనొప్పి, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హెవీ బ్లీడింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి నెల నెలసరి సమయంలో స్త్రీలు కొన్ని రకాల పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదని చెబుతున్నారు. మరి నెలసరి సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామంది స్త్రీలు పీరియడ్స్ నొప్పిని తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మందులను ఎక్కువగా వేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందట. అలాగే గుండెపోటు, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుందని చెబుతున్నారు. పీరియడ్స్ లో తీవ్రమైన వ్యాయామాలు చేస్తే అది రుతుచక్రం, పీరియడ్ ప్రవాహం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. ఇలాంటి పరిస్థితిలో మీరు చురుకుగా ఉండటానికి పీరియడ్స్ సమయంలో చిన్న వ్యాయామాలు చేస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో ఎప్పటికప్పుడు ప్యాడ్లను మార్చడం కూడా చాలా ముఖ్యం.

లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మంపై దురద, దద్దుర్లు కలిగించడమే కాకుండా ప్యాడ్ లో జన్మించిన బ్యాక్టీరియా కారణంగా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కూడా సంభవిస్తుందట. అందుకే ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి ప్యాడ్ లను మారుస్తూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. ఈ సమయంలో డీహైడ్రేషన్ వల్ల రక్తప్రసరణ దెబ్బతింటుంది. అలాగే అపానవాయువు సమస్య కూడా వస్తుందట. అందుకే ఈ సమయంలో నీళ్లను పుష్కలంగా తాగాలట. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను కూడా తీసుకోవాలని చెబుతున్నారు.

note : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.