Site icon HashtagU Telugu

Health Tips: కాబోయే తల్లులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదట?

Health Tips

Health Tips

స్త్రీలకు మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం లాంటిది. వివాహమైన ప్రతి ఒక్క స్త్రీ కూడా గర్భం దాల్చాలని, అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాలంటే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలన్న విషయం తెలిసిందే. అయితే కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా గర్భం దాల్చబోయే స్త్రీలు కూడా కొన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు. అలాగే గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు కొన్ని కొన్ని ప‌నుల‌కు కూడా దూరంగా ఉండాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెద్ద పెద్ద బ‌‌రువున్న వ‌స్తువులు, వాట‌ర్ బ‌కెట్లు ఎత్తేస్తుంటారు. కాని ఇలా చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు బలహీనంగా మార‌డం, పొట్ట సాగిపోవ‌డం వంటి జ‌రుగుతుంటాయట. అలాగే కొంద‌రు మ‌హిళ‌లు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బ‌ట్ట‌లు ఉత‌క‌డం చేస్తుంటారు. కానీ బేబీ బంప్ తో వంగుతూ, లేస్తూ బ‌ట్ట‌లు ఉత‌క‌డం అనేది చాలా క‌ష్ట‌మైన ప‌ని కాబట్టి ఈ పనిని చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మీతో పాటు క‌డుపులోని బిడ్డ కూడా అసౌక‌ర్యానికి గుర‌వుతుందట. అలాగే ప్రెగ్రెన్సీ స‌మ‌యంలో బ‌ట్ట‌లు ఉత‌క‌డం మానుకోవాలి. అలాగే గర్భం ధరించిన తర్వాత కూడా చాలా మంది ఇల్లు తుడవడం, బాత్రూంలు కడగడం వంటివి చేస్తుంటారు.

కానీ, ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఇలా చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదట. కేవలం నెలలు నిండిన వాళ్లు మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎందుకూ అంటే ఇల్లు తుడవడానికి, బాత్రూంలు కడగడానికి వాడే లిక్విడ్స్‌లో ప‌లు ర‌కాల‌ కెమిక‌ల్స్ ఉంటాయి. అవి పిల్చితే క‌డుపులో బిడ్డ‌కు హానిక‌రంగా మార‌తాయట. ఇక వీటితో పాటు ఎక్కువ స‌మ‌యం పాటు నిల‌బ‌డ‌టం, ఒకే చోటు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చోవ‌డం లాంటివి చేయడం కూడా అసలు మంచిది కాదని చెబుతున్నారు.
మేక‌ప్ ప్రోడెక్ట్స్ వాడ‌టం, జుట్టుకు క‌ల‌ర్ వేసుకోవ‌డం, నిద్ర లేకపోవడం, ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, ఆల్క‌హాల్ సేవించ‌డం, స్మోకింగ్ చేయ‌డం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.