Site icon HashtagU Telugu

Pregnancy Mistakes: ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?c

Pregnancy Mistakes

Pregnancy Mistakes

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోమని, తెలిసి, తెలియక కొన్ని రకాల తప్పులు చేయవద్దని ఇంట్లో పెద్దవారు అలాగే వైద్యులు పదేపదే సూచిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఊహించని పరిణామాలు జరిగి కడుపుకోతే మిగులుతూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఉంటే వారికి వారితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు అంత మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయ్యాక చాలా మంది ఎక్కువగా తినమని చెబుతారు. కానీ, ఇలా ఎక్కువగా కేలరీలు తింటే అజీర్ణం, షుగర్ వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా మన శరీరం 100 అదనపు కేలరీలు మాత్రమే తట్టుకుంటుంది. కానీ, ఎక్కువగా తినడం, కేలరీలు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత మంచిది. కానీ, కడుపులోని బిడ్డలు ఎక్కువగా కదలడం వల్ల తక్కువ నిద్ర పోతారు. సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. రాత్రంతా మేల్కొని ఉండడం, మొబైల్‌ ఎక్కువగా ఉపయోగించడం మానుకోవాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి. కుడివైపు, వెల్లకిలా పడుకోకపోవడమే మంచిది. ప్రెగ్నెంట్స్ ఏ పని చేయకూడదు. చిన్న చిన్న వర్కౌట్స్ చేయాలి.

గర్భిణీలు వాకింగ్ చేయడం, తక్కువ ఇంపాక్ట్ ఉన్న వర్కౌట్స్ చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వీలైనంతవరకు ప్రయాణాలకు అలాగే టిప్ హాలిడే ట్రిప్పులు ఫ్యామిలీ ట్రిప్పులు వంటి వాటికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకూ అలాంటి ట్రిప్స్‌కి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే టూర్ సమయంలో సడెన్‌గా నొప్పి వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా వైద్యులు అందుబాటులో లేక ఊహించని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. అదే విధంగా, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీని వల్ల పిల్లల జీవితానికి ప్రమాదకరం. ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ ఇచ్చిన సలహాలు జాగ్రత్తగా పాటించాలి. చాలా మంది వైద్యులు చెప్పిన వాటిని మరిచిపోతారు. పట్టించుకోరు. అలా చేయడం వల్ల మీకే ప్రమాదం.