Leukemia Symptoms: లుకేమియా లక్షణాలు

లుకేమియా గురించి డాక్టర్లు అంటుంటే వినడమే తప్ప ఈ వ్యాధి గురించి చాలా మందికి ఖచ్చితంగా తెలియదు. ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. ఇందులో తెల్ల రక్తకణాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి

Leukemia Symptoms: లుకేమియా గురించి డాక్టర్లు అంటుంటే వినడమే తప్ప ఈ వ్యాధి గురించి చాలా మందికి ఖచ్చితంగా తెలియదు. ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. ఇందులో తెల్ల రక్తకణాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. లుకేమియా లక్షణాల్ని సమయానికి గుర్తించకపోతే, ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు. లుకేమియా రకం క్యాన్సర్‌గా మారే రక్త కణాల రకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం.

స్థిరమైన అలసట:
నిరంతరం అలసిపోయినట్లు లేదా నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తే కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఈ సందర్భంలో, దానిని విస్మరించవద్దు. సమయానికి వైద్యుడిని సంప్రదించండి. శరీరంలో రక్తం తక్కువైనప్పుడు మాత్రమే అలసట మరియు బలహీనతగా అనిపిస్తుంది. రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అని కూడా అంటారు.

ఆకస్మిక గాయం:
శారీరకంగా ఎలాంటి గాయాలు లేకుండా శరీరంలోని ఏదైనా భాగంలో గాయాలు లేదా నలుపు లేదా నీలం రంగు మచ్చలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే గాయం మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే ఇది లుకేమియాకు సంకేతం కావచ్చు.

తలనొప్పి:
నిరంతరం తలనొప్పి ఉంటే అది న్యూకేమియా లక్షణం కావచ్చు. ఇది తలలో రక్తస్రావాన్ని సూచిస్తుంది.

రాత్రి అకస్మాత్తుగా చెమటలు పట్టడం:
నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా రాత్రిపూట చెమటలు పడుతుంటే వైద్యుడిని కలిసి సమస్య వివరించాలి. ఇలా ఒక్కసారిగా చెమటలు పట్టడం మామూలు విషయం కాదు. ఇది సాధారణంగా లుకేమియాకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది.

Also Read: Health: కిడ్నీలో రాళ్తు వస్తున్నాయా.. అయితే వీటికి దూరంగా ఉండండి!