Heart Attack: ఈ ఆహార పదార్థాలు తింటే చాలు వద్దన్నా హార్ట్ ఎటాక్ రావడం ఖాయం?

ఈ రోజుల్లో చాలామంది గుండెపోటు కారణంగా మరణిస్తున్న విషయం తెలిసిందే. యుక్త వయసు వారే ఎక్కువగా ఈ సమస్యతో మరణిస్తున్నారు. ప్రతి పదిమందిలో

  • Written By:
  • Publish Date - February 4, 2024 / 08:00 PM IST

ఈ రోజుల్లో చాలామంది గుండెపోటు కారణంగా మరణిస్తున్న విషయం తెలిసిందే. యుక్త వయసు వారే ఎక్కువగా ఈ సమస్యతో మరణిస్తున్నారు. ప్రతి పదిమందిలో ఒక్కరూ లేదా ఇద్దరు ఈ గుండెపోటు కారణంగానే మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ అన్నది చాలా డేంజర్. ఈ హార్ట్ ఎటాక్ వచ్చింది అంటే చాలు ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయినా సరే సెకండ్ల వ్యవధిలోనే చనిపోవాల్సిందే. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో చెప్పడం అంచనా వేయడం కూడా చాలా కష్టం. అయితే నిజానికి హార్ట్ ఎటాక్ కు వయసుతో సంబంధమే లేదు. ఈ రోజులో అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్ సమస్య కామన్ అయిపోయింది. చిన్న పిల్లల్లోనూ హార్ట్ ఎటాక్ రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.

అయితే హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం మన జీవన శైలి, మనం తినే ఆహారం. అందుకే మనం తినే ఆహారాన్ని బట్టే మనకు హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు కనిపిస్తాయి. మీరు విన్నది కరెక్టే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే వద్దన్నా గుండెపోటు వస్తుంది అంటున్నారు వైద్యులు. మరి ఇంతకీ ఆ డేంజరస్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుకీలు, కేక్స్, పాస్ట్రీలు ఇవన్నీ బేక్ చేసే ఆహార పదార్థాలు. వీటిలో ఉండే షుగర్ కంటెంట్ వల్ల, ఫ్యాట్స్ వల్ల గుండెకు కొవ్వు పడుతుంది. ప్రతి రోజూ కుకీలు, పాస్ట్రీలు, కేకులు ఎక్కువగా తింటే గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే సలాడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. షుగర్, సాల్ట్ తో చేసిన సలాడ్స్ వంటి వాటి జోలికి అస్సలు పోకూడదు. కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్స్ అయితే పర్లేదు.

కానీ షుగర్, ఉప్పుతో తయారు చేసిన సలాడ్స్ వల్ల బీపీ పెరగడంతో పాటు అనవసరమైన కొవ్వు ఒంట్లో చేరుతుంది. అలాగే సెరీల్స్ ను కూడా తినడం తగ్గించాలి. సెరీల్స్ ను చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా తింటుంటారు. వీటిలోనూ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటికి కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఇంకా పొటాటో చిప్స్, బనానా చిప్స్, ఇంకా నూనెలో వేయించిన అన్ని రకాల చిప్స్, ఇతర పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ జోలికి అయితే అస్సలు పోకూడదు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో లభించే నూడుల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ దేన్నీ తినకూడదు. అవి చాలా డేంజర్. గుండెకు అవి ఎంతో చేటు చేస్తాయి. అలాగే పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫ్రై చేసిన పదార్థాలను వేటిని కూడా తినకూడదు. చాలామంది చికెన్, మటన్, ఫిష్ ఇతర మాంసాహారాన్ని ఫ్రిడ్జ్ లో దాచుకొని తింటుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అసలు ఫ్రిడ్జ్ లో దాచుకొని చాలా రోజుల తర్వాత మాంసాహారాన్ని వండుకొని తినకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాంసాన్ని మాత్రమే తినాలి. ఇలా పైన చెప్పిన ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం అంత తక్కువ.